విరాట్‌ కోహ్లీగా దుల్కర్‌ సల్మాన్‌ !

Published on Aug 12, 2018 2:55 pm IST

మహానటి చిత్రంతో తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న మలయాళ యంగ్ హీరో దుల్కర్‌ సల్మాన్‌. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం అనుజా చౌహాన్‌ నవలను బేస్ చేసుకోని ‘జో యా ఫ్యాక్టర్‌’ అనే చిత్రం తెరకెక్కుతుంది. కాగా ఈ చిత్రంలో విరాట్‌ కోహ్లీ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర అట, ఇప్పుడు ఆ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్నాడు.

2011 వన్డే వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో ఈ చిత్రం సాగనుంది. ఓ రాజ్‌పుత్‌ యువతి ఇండియా క్రికెట్ టీమ్ ను కలుసుకుంటుంది. ఆ తర్వాత మన భారత్ టీమ్‌ వరల్డ్‌క్‌ప్ ను గెలుస్తోంది. ఆ గెలుపులో ఆ యువతి పాత్ర కూడా ఉందట. అందుకే మెన్‌ ఇన్‌ బ్లూకు అదృష్ట దేవతగా మారింది అంటుంది చిత్రబృందం. ఏమైనా దుల్కర్‌ సల్మాన్‌ విరాట్‌ కోహ్లీ పాత్రను పోషిస్తుంతుండటంతో అటు దుల్కర్ అభిమానాలు, ఇటు కోహ్లీ అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :

X
More