మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘ఐ యామ్ గేమ్’ రిలీజ్ డేట్‌ను తాజాగా లాక్ చేసుకుంది. ఈ భారీ చిత్రాన్ని 2026, ఆగస్టు 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
‘ఆర్డీఎక్స్’ ఫేమ్ నహాస్ హిదాయత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ తన సొంత నిర్మాణ సంస్థ వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
ఈ సినిమాలో ఆంటోనీ వర్గీస్, కయాదు లోహర్, మిస్కిన్, వినయ్ ఫోర్ట్, పార్థ్ తివారీ, సంయుక్త విశ్వనాథన్, ఆడమ్, ఆశిష్ మాథ్యూ వంటి భారీ తారాగణం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, ఈ మూవీ టీజర్ మరియు మరిన్ని అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి.


