దుల్కర్ సినిమాలకు డిమాండ్ పెరిగింది !

దుల్కర్ సినిమాలకు డిమాండ్ పెరిగింది !

Published on Jun 12, 2018 4:24 PM IST

Athade
మలయాళ యువ హీరో దుల్కర్ సల్మాన్ మంచి నటుడనే సంగతి మలయాళ సినిమాలతో పరిచయమున్న ప్రతిఒక్కరికీ తెలిసిందే. ఇటీవల విడుదలైన ‘మహానటి’ చిత్రంలో జెమినీ గణేశన్ పాత్రలో ఆయన పెర్ఫార్మెన్స్ కు ఇంతకు ముందు ఆయనెవరో తెలియనివారు కూడ ఫిదా అయిపోయారు. ఒకరకంగా చెప్పాలంటే అభిమానులుగా మారిపోయారు.

దీంతో ఆయన నటించిన మలయాళ హిట్ సినిమాలను తెలుగులోకి అనువదించేందుకు ఆసక్తి చూపుతున్నారు పలువురు నిర్మాతలు. తాజాగా వెంకటేష్ అనే నిర్మాత 2017లో దుల్కర్ చేసిన ‘సోలో’ అనే సినిమాను ‘ఆతడే’ పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. జూన్ 22న ఈ చిత్రం విడుదలకానుంది. బిజోయ్ నంబియార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నేహా శర్మ, ధన్సిక, ఆర్తి వెంకటేష్, శృతి హరిహరన్ లు హీరోయిన్లుగా నటించారు.

తాజా వార్తలు