‘వర్జిన్ బాయ్స్’ మూవీ నుంచి ‘దం దిగా దం’ సాంగ్ రిలీజ్

‘వర్జిన్ బాయ్స్’ మూవీ నుంచి ‘దం దిగా దం’ సాంగ్ రిలీజ్

Published on Jun 25, 2025 7:30 AM IST

virgin boys

రాజ్ గురు బ్యానర్ పై రాజా దారపునేని నిర్మాతగా దయానంద్ గడ్డం రచన,దర్శకత్వంలో జూన్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘వర్జిన్ బాయ్స్’. ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించనున్నారు. స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. తాజాగా ఈ చిత్రం నుండి విడుదలైన ‘దం దిగా దం’ పాటకు ప్రణవ్ చాగంటి లిరిక్స్ అందించగా యాసిర్ నిసర్ తన స్వరాన్ని అందించారు.

ఈ సందర్భంగా వర్జిన్ చిత్ర నిర్మాత రాజా దారపనేని మాట్లాడుతూ.. “సాంగ్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పటికే వర్జిన్ బాయ్స్ చిత్రం నుండి టీజర్ ఇంకా ఒక పాటకు మంచి స్పందన లభించింది. సినిమా యూత్ ఫుల్ గా ఉండబోతుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని ఎన్నో ప్రశంసలతో కొనియాడారు. చిత్రంలో ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. చిత్రానికి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్ వచ్చింది. చిత్రాన్ని నైజంలో ఏషియన్ సునీల్ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. జులై 11వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది” అన్నారు.

నటి జెన్నీఫర్ ఇమాన్యుల్ మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు చిత్ర బంధం అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ చిత్రంలో నటించిన వారితో పనిచేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. జెడి మాస్టర్ తో కలిసి పనిచేయడం ప్రత్యేకంగా కనిపించింది” అన్నారు.

నటుడు శ్రీహాన్ మాట్లాడుతూ.. “నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన బాలు గారికి, మిత్ర గారికి, రాజా గారికి ధన్యవాదాలు. ఈ సినిమా పూర్తిగా యూత్ కు ఎంటర్టైన్మెంట్ కోసం చేసింది. ఈ చిత్రంలో ఏది మంచిది ఏది కానిది అనేది ఎన్నో విషయాలు చెప్పాము. ఈ సినిమా చూస్తే పూర్తిగా ఎంటర్టైన్ అవుతారు. జూలై 11వ తేదీన తప్పకుండా థియేటర్లో ఈ చిత్రంని చూడండి” అన్నారు.

చిత్ర దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ.. “ఈ చిత్రం ఒక మంచి లవ్ స్టోరీ తో యూత్ ఫుల్ గా ఉండబోతుంది. సినిమా చూసినంతసేపు మీ కాలేజీ రోజు గుర్తొస్తాయి. ఈ చిత్రం కోసం నిర్మాత రాజా గారు అలాగే నటీనటులు అందరితో పని చేయడం నాకు ఎంత సంతోషకరంగా కనిపించింది. మీరందరితో కలిసి పనిచేసి మంచి సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. నేడు విడుదలైన పాట ప్రేక్షకులందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. జులై 11వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రానికి మంచి సంగీతాన్ని అందించిన స్మరణ్ సాయికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చిత్రంలో మంచి బిజీఎం తో పాటు మొత్తం ఆరు పాటలు ఉంటాయి. అలాగే చిత్రం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మరోసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు గీతానంద్, నటి మిత్ర శర్మ తదితరులు పాల్గొని మాట్లాడారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు