
సినిమా సినిమాకి పొంతన లేకుండా సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్న యంగ్ హీరో మంచు విష్ణు హీరోగా, ‘వెన్నెల’, ‘ప్రస్థానం’, ‘ఆటోనగర్ సూర్య’ లాంటి విమర్శనాత్మక సినిమాలను డైరెక్ట్ చేసిన దేవ కట్ట డైరెక్టర్ గా వస్తున్న సినిమా ‘డైనమైట్’. విష్ణు సరసన ప్రణిత హీరోయిన్ గా కనిపించనుంది. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా రిలీజ్ కోసం డేట్ ని ఫిక్స్ చేసారు. తాజా సమాచారం ప్రకారం జూలై 3న డైనమైట్ సినిమాని రిలీజ్ చేయడానికి ఈ చిత్ర టీం నిర్ణయించుకుంది.
ఇటీవలే రిలీజ్ చేసిన ఈ చిత్ర సాంగ్స్ మరియు ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. డైనమైట్ లో మంచు విష్ణు ఫుల్ ఇంటెన్స్ పాత్రలో సూపర్బ్ యాక్షన్ సీక్వెన్స్ లతో అందరినీ ఆకట్టుకుంటాడని సమాచారం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా విక్రమ్ ప్రభు హీరోగా, ప్రియ ఆనంద్ హీరోయిన్ గా తమిళంలో ఘన విజయం సాధించిన ‘అరిమ నంబి’కి రీమేక్. మంచు మోహన్ బాబు సమర్పణలో ప్రతిష్టాత్మకమైన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.