“RRR”లో ఒక్కో ఫైట్ సీన్ అద్భుతం.!

“RRR”లో ఒక్కో ఫైట్ సీన్ అద్భుతం.!

Published on May 25, 2021 1:00 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి ఇద్దరు బిగ్గెస్ట్ మాస్ హీరోలతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మన దేశంలోనే ఏ చిత్రానికి జరగని రీతి ఓవరాల్ బిజినెస్ జరిపి కనీ వినీ ఎరుగని రికార్డులను సెట్ చేసింది.

మరి అలా ఎన్నో అంచనాలు పెట్టుకున్న ప్రతి ఒక భారతీయుడి అంచనాలు ఈ సినిమా ఎక్కడా తగ్గకుండా రీచ్ అవుతుందని రాజమౌళి తండ్రి ఈ సినిమా రచయిత వి విజయేంద్ర ప్రసాద్ లేటెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు. ఈ సినిమా కోసం పెద్దగా చెప్పుకున్నా ఫైట్ సీక్వెన్స్ లు మాత్రం అద్భుతంగా ఉంటాయని..

ప్రతీ ఒక్క ఫైట్ సీక్వెన్స్ కూడా మరో స్థాయిలో ఉండడమే కాకుండా చాలా భావోద్వేగపూరితంగా ఉంటాయని తెలిపారు. అలాగే ఒక్కో ఫైట్ కూడా చాలా విభిన్నంగా అనిపిస్తాయని ఆయన వెల్లడించారు. మరి ఆ సన్నివేశాలు ఎలా ఉండనున్నాయి తెలియాలి అంటే వచ్చే అక్టోబర్ 13 వరకు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు