ఫుట్‌బాల్ కిట్‌ లు ఇస్తోన్న ‘విజిల్’ టీమ్ !

Published on Oct 23, 2019 3:00 am IST

త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ హీరోగా ‘రాజా రాణి’ ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా ‘విజిల్’. కాగా దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 25 న ఈ సినిమా విడుదల చేయనున్నారు. కాగా రేపు హైదరాబాద్‌ లో ‘విజిల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఇప్పటికే అన్ని సిద్ధం అయింది. కాగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఫుట్‌బాల్ అభివృద్ధికి తోడ్పడే మార్స్ ఫుట్‌బాల్ ఫౌండేషన్‌కు చెందిన 20 మంది బాలికలకు మరియు 20 మంది అబ్బాయిలలకు ఫుట్‌బాల్ కిట్‌ లను అందించనుంది.

ఇక విజయ్ అట్లీ కాంబినేష‌న్‌లో విడుద‌లైన తెరి(పోలీస్‌), మెర్స‌ల్‌(అదిరింది) చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలుగా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీరి క‌ల‌యిక‌లో హ్యాట్రిక్ చిత్రంగా బిగిల్‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. న‌య‌న‌తార హీరోయిన్‌ గా న‌టిస్తోన్న‌ ఈ సినిమాను ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌ మెంట్స్ ప‌తాకం పై క‌ల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు. హీరో విజ‌య్‌ కెరీర్‌ లో భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిది.

సంబంధిత సమాచారం :

X
More