ఇంటర్వ్యూ : రమాకాంత్ – ఏప్రిల్ 1న పుట్టిన ముగ్గురు ఫూల్స్ కథ

Published on Aug 22, 2019 3:33 pm IST

నూతన నటీనటులతో తెరకెక్కుతున్న చిత్రం ఏదైనా జరగొచ్చు…, నూతన దర్శకుడు రమాకాంత్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కించాడు. ఈనెల 23న విడుదల నేపథ్యంలో ఆయన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు మీకోసం…

 

ఏదైనా జరగొచ్చు అని టైటిల్ పెట్టారు,అసలు ఏమి జరగొచ్చు?

ఏదైనా జరగొచ్చు థ్రిల్లర్, హారర్ చిత్రం అండి, ఏమి జరుగుతుందో అనేది రేపు మీరు తెరపై చూసి తెలుసుకోవాలి.

 

మీ ఫిలిం కెరీర్ గురించి చెవుతారా?

నేను దర్శకుడు చంద్ర శేఖర్ ఏలేటి దగ్గర అనుకోకుండా ఒక రోజు, ప్రయాణం చిత్రాలకు పనిచేశాను. ఆ తరువాత ఓ ఫిలిం కోర్స్ చేయడానికి ఫ్రాన్స్ వెళ్లడం జరిగింది. ఇప్పుడు నా ఓన్ గా ఏదైనా జరగొచ్చు సినిమా చేస్తున్నాడు.

 

కొత్తవాళ్లతో ఈ చిత్రం చేయడానికి కారణం చెవుతారా?

పేరున్న హీరో కొత్తవారికి అవకాశం ఇవ్వాలంటే మనం మనల్ని నిరూపించుకోవాలి. అలాగే ఈ చిత్రం రెగ్యులర్ కమర్షియల్ ఫార్మటు లో సాగదు. ఇందులో నటించిన ముగ్గురికి సమాన ప్రాధాన్యత ఉంటుంది. దీనితో పాటు కొత్తవారైతే నేను అనుకున్నది అనుకున్నట్లుగా తెరపై చూపించగలనని అనిపించింది. అందుకే కొత్తవాళ్లను ఎంచుకున్నాను.

 

టైటిల్ ఏదైనా జరగొచ్చు అని పెట్టారు, కారణం?

ఈ చిత్రంలో మూడు ప్రధాన పాత్రలు చేసే ఒక్కొక్క పొరపాటు కారణంగా మరొక సమస్యలో వారికి తెలియకుండానే పడుతుంటారు. ఈ చిత్రం పూర్తిగా కొత్తగా ఉంటుంది. ఎక్కడ కూడా కాపీ చేసినట్లుగా కానీ, ఇంతకు ముందు చూసినట్లుగా కానీ అనిపించదు.

 

స్టోరీ లైన్ గురించి చెవుతారా?

ఏప్రిల్ 1 న పుట్టిన ముగ్గురు ఫూల్స్ కథ ఇది. ఈ ముగ్గురు ఫూల్స్ తాము ఫూల్స్ కాదని నిరూపించుకునే క్రమంలో ఇంకా స్టుపిడ్ పనులు చేస్తుంటారు.

 

కాస్టింగ్ ఎలా ఎంపిక చేశారు?

ఆడిషన్స్ జరపడం జరిగింది. ఆడిషన్స్ అనంతరం ఆ పాత్రలకు సెట్ అయినవారిని పాత్రల కొరకు తీసుకోవడం జరిగింది.

 

వెన్నెల కిశోర్ పాత్ర గురించి?

ఆయన ఓ క్రేజీ ఫిలిం డైరెక్టర్ పాత్ర చేయడం జరిగింది. ఒరిజినల్ దెయ్యంతో సినిమా చేస్తా అని పట్టుబట్టే డైరెక్టర్ గా ఆయన పాత్ర అలరిస్తుంది.

 

అజయ్ ఘోష్ పాత్ర గురించి చెప్పండి?

ఆయన టిపికల్ రోల్ చేస్తున్నారు. అజయ్ ఘోష్ గోస్ట్ బస్టర్(దెయ్యాలు పెట్టేవాడు) పాత్ర చేయడం జరుగుతుంది. ఆయన పాత్ర కూడా ఈ మూవీకి కీలకం.

 

సినిమా బడ్జెట్ గురించి చెప్పండి?

సినిమా బడ్జెట్ అనుకున్నదానికంటే కొంచెం పెరిగింది. కారణం మేము క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. అలాగే మొదట్లో బాబీ సింహ, వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్ వంటి నటులను ఈ చిత్రం కోసం అనుకోలేదు. నేనైతే రెండు రోజులు అటూ, ఇటుగా అనుకున్న సమయానికి చిత్రాన్ని పూర్తి చేయడం జరిగింది.

 

చిత్రాన్ని ఏఏ ప్రాంతాలలో చిత్రించారు?

చిత్రీకరణ మొత్తం ఈ మూవీ హైద్రాబాదులోనే జరిగింది. ఓల్డ్ సిటీ, హైటెక్ సిటీ ఇలా హైదరాబాద్ లోని అనేక ప్రాంతాలలో చిత్రీకరణ జరిపాం.

 

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెబుతారా?

ముందు ఈ మూవీ ఫలితం రానివ్వండి. నేనైతో కథలతో సిద్ధంగా ఉన్నాను, చూద్దాం…

సంబంధిత సమాచారం :