స్టార్ ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వరరావు ఇకలేరు.!

Edidi-Nageswar-rao
1970-80 టైంలో తెలుగు చిత పరిశ్రమకి ఎన్నో మరపు రాణి ఆణిముత్యాల్లాంటి సినిమాలను అందించి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన నిర్మాత ఏడిద నాగేశ్వర రావు. ఈ రోజు సాయంత్రం ఆయన తన స్వగృహంలో కన్ను మూశారు. 81 సంవత్సరాల వయసు కలిగిన ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో కన్ను మూశారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు ఇందాస్త్రీలోని ప్రముఖులంతా శోఖ సముద్రంలో మునిగిపోయారు.

ఏడిద నాగేశ్వరరావు. సిరిసిరి మువ్వ, శంకరాభరణం, సీతాకోక చిలుక, సాగర సంగమం, సితార, స్వాథీ ముత్యం, స్వయం కృషి, ఆపద్భాందవుడు లాంటి మరపురాని, మర్చిపోలేని సినిమాలను ఆయన అందించారు. 1934 ఏప్రిల్ 4న ఆయన జన్మించారు. ఇండస్ట్రీలోని ప్రముఖులందరి సందర్శనార్ధం రేపు ఉదయం 7 గంటల వరకూ ఫిల్మ్ నగర్ లోని ఆయన స్వగృహంలో మృతదేహాన్నిఉంచుతారు. ఆ తర్వాత టోలీచోకీ లోని మహాప్రస్థానం స్మాశాన వాటికలో ఆయనకి అంత్యక్రియలు నిర్వహిస్తారు.

ఈ లోకం విడిచి వెళ్లి తన కుటుంబ సభ్యులను శోఖ సంద్రంలో ముంచెత్తిన ఏడిద నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు 123తెలుగు.కామ్ తరపున సంతాపం తెలియజేస్తున్నాం.

Exit mobile version