మోషన్ పోస్టర్ తో సిద్ధంగా ఉన్న తరుణ్ భాస్కర్ !


మొదటి సినిమా ‘పెళ్లి చూపులు’తో భారీ సక్సెస్ అందుకుని అందరి దృష్టినీ ఆకట్టుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రస్తుతం తన రెండవ ప్రాజెక్ట్ ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ మీద ‘నీ గ్యాంగ్ తో రా థియేటర్ కి, చూస్కుందాం’ అంటూ ఆసక్తిని రేకెత్తించిన ఆయన రేపు మోషన్ పోస్టర్ తో మన ముందుకురానున్నారు.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో సుశాంత్ రెడ్డి, విశ్వక్ సేన్ నాయుడు, వెంకటేష్ కాకుమాను, అభినవ్ గోమటంలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విడుదలకు ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రంతో మరోసారి తరుణ్ భాస్కర్ తన ప్రత్యేకతను చాటుకుంటారని ఫిల్మ్ నగర్ టాక్.

Exit mobile version