విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ !

విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ !

Published on Jun 19, 2018 11:22 AM IST


‘పెళ్లి చూపులు’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రస్తుతం తన రెండవ సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ పనుల్లో బిజీగా ఉన్నారు. సినిమా పేరులోనే వైవిధ్యాన్ని చూపిన తరుణ్ భాస్కర్ ట్రైలర్లో ఇంకాస్త వెరైటీని మిక్స్ చేసి మంచి ఫన్ ఇచ్చారు. ఈ ఎంటర్టైనింగ్ ట్రైలర్ తో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు ఇంకాస్త పెరిగాయి.

ఈ చిత్రాన్ని జూన్ 29న విడుదల చేయనున్నట్లు నిర్మాత సురేష్ బాబు కొద్దిసేపటి క్రితమే జరిగిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో ప్రకటించారు. సుశాంత్ రెడ్డి, విశ్వక్ సేన్ నాయుడు, వెంకటేష్ కాకుమాను, అభినవ్ గోమటంలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించారు. మరి మొదటి సినిమాతో సంచలనం సృష్టించిన తరుణ్ భాస్కర్ రెండవ సినిమాతో ఎలాంటి హడావుడి చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు