వాల్మీకి లో తెలుగు హీరోయిన్ ?

Published on Feb 4, 2019 9:21 am IST

యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగర్తండా ను తెలుగులో రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. ‘వాల్మీకి’ అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రం ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. బాబీ సింహ పోషించిన పాత్రలో వరుణ్ తేజ్ నటించనుండగా సిద్దార్థ పాత్రలో శ్రీ విష్ణు నటించనున్నాడని సమాచారం. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా తెలుగు అమ్మాయి ఇషా రెబ్బ ను తీసుకోవాలనుకుంటున్నారు అయితే ఇంతకు ముందు కన్నడ బ్యూటీ రష్మిక కూడా హీరోయిన్ గా నటించనుందని వార్తలు వచ్చిన వచ్చాయి. మరి ఈ ఇద్దరిలో ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి.

14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మించనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈచిత్రాన్ని విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఆయనంక బోస్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిచనున్నారు.

సంబంధిత సమాచారం :