స్టార్స్ నుండి రంజాన్ శుభాకాంక్షలు !

Published on May 25, 2020 9:57 am IST

దివ్య ఖురాన్ గ్రంథం అవతరించిన మాసం రంజాన్. ముస్లింలు పవిత్ర ఉపవాసాలతో గడిపే రంజాన్ మాసం ముగిశాక, షవ్వల్ నెల మొదటి రోజున ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు. ఈ పండుగనే మనం రంజాన్ పేరుతో పిలుస్తాం. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు సినీ ప్రముఖులు.

మెగాస్టార్ ‘ఈద్ ముబారక్. అందరికి రంజాన్ శుభాకాంక్షలు! ఈ పండగ మీకు శాంతిని సంతోషాన్ని ప్రేమను కలగజేయాలని కోరుకుంటూ చిరు ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ కూడా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెబుతూ ‘ రంజాన్ శుభాకాంక్షలు, ప్రతి ఒక్కరికీ ఈద్ ముబారక్’ అని విష్ చేశారు.

మహేష్ బాబు ట్వీట్ చేస్తూ.. ‘మీ అందరికీ ఈద్ శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రోజున, ఈద్ మనకు ఆత్మశాంతిని, ప్రేమను మరియు సమైక్యతను ఇస్తుందని, అన్ని అసమానతలకు వ్యతిరేకంగా బలంగా నిలబడటానికి మనకు బలాన్ని ఇస్తుందని కోరుకుంటూ మహేష్ పోస్ట్ చేశారు.

సమాజంలోని జాలి, కరుణ, సేవాతత్పరత, సుహృద్భావానికి ఈ పండగ ప్రతీక. కరోనా మహమ్మారి విసురుతున్న సవాళ్ల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉంటూ సురక్షిత దూరాన్ని పాటిస్తూ ఈద్ జరుపుకోవాలి.

సంబంధిత సమాచారం :

More