‘మహాభారతం’లో కృష్ణుడిగా మహేష్ బాబు !
Published on Apr 19, 2017 12:35 pm IST


మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించనున్న రూ. 1000 కోట్ల ప్రాజెక్ట్ అన్ని భాషలు పరిశ్రమల్ని ఆశ్చర్యంలో ముంచేత్తింది. ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎమ్టీ వాసుదేవన్ నాయర్ రచించిన ‘రండమోజమ్’ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, ఫిలాంత్రఫిస్ట్ అయిన డా. బి. ఆర్.శెట్టి ఈ భారీ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నారు. మహాభారతంలోని అత్యంత కీలకమైన పాత్రల్లో ఒకటైన భీముడి పాత్రను ఆధారంగా ఈ కథ నడుస్తుంది.

ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ నవల రూపంలో సిద్ధంగా ఉండటం వలన నటీనటుల ఎంపికపై దృష్టిపెట్టారు దర్శక నిర్మాతలు. ప్రపంచ స్థాయి కాస్టింగ్ కంపెనీ ఈ చిత్రం కోసం నటీనటుల్ని ఎంపిక చేస్తోంది. అందులో భాగంగానే ఇందులో కృష్ణుడి పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబును అనుకుంటున్నట్లు సమాచారం. మహేష్ తో పాటే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా పరిశీలనలో ఉన్నారట. మరి ఈ ఇద్దరిలో ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి. ఈ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహించనున్న దర్శకుడు శ్రీకుమార్ మీనన్ మాట్లాడుతూ ఈ సినిమాను 2020 కల్లా పూర్తి చేస్తామని అన్నారు.

 
Like us on Facebook