కోలీవుడ్ ఎవరికి పట్టం కడుతుందో తేలేది నేడే…!

Published on Jun 23, 2019 11:08 am IST

అనేక వివాదాలు,ఆరోపణలు తోసిరాజంటూ నేడు తమిళ సినీపరిశ్రకు చెందిన నడిగర్ సంఘం ఎన్నికలు ఉదయం నుండి ప్రశాంతంగా జరుగుతున్నాయి. పోయినసారి విజయం సాధించిన విశాల్ టీమ్ తో నటుడు భాగ్యరాజు టీమ్ పోటీపడుతోంది. రెండు గ్రూపులు విజయంపై ధీమాగా ఉన్నారు.ఐతే ఎన్నికల ఫలితాలు మాత్రం వెంటనే వెలువడే అవకాశంలేదు.

మద్రాసు హై కోర్ట్ తీర్పు ప్రకారం పరిశ్రమకు చెందిన 61మంది వ్యక్తుల సభ్యత్వానికి సంబందించిన తీర్పు వెలువడే వరకు ఎన్నికలు ఫలితాలు ప్రకటించడానికి వీలులేదు. దీనితో ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు తమిళ పరిశ్రమలోని ప్రధాన ప్రత్యర్థుల ఉత్కంఠ కొనసాగడం ఖాయంగా కనబడుతుంది. విశాల్ నాయకత్వాన్ని హర్షించి లేని కొందరు ఇండస్ట్రీ పెద్దలు ఈసారి ఆయన్ని ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకొని పనిచేశారని తెలుస్తుంది. మరి తమిళ సినీ పరిశ్రమ ఎవరివైపు నిలబడుతుందో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :

More