అదిరిపోయే డాన్స్ లతో సర్ప్రైజ్ చేయనున్న బన్ని

అదిరిపోయే డాన్స్ లతో సర్ప్రైజ్ చేయనున్న బన్ని

Published on Nov 8, 2015 4:05 AM IST

allu-arjun
ఒక క్రేజీ కాంబినేషన్ లో సినిమా సెట్ అయ్యింది అంటే ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. అలాంటి భారీ అంచనాలను క్రియేట్ చేసిన కాంబినేషన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – బోయపాటి శ్రీనులది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమాకి ‘సరైనోడు’ అనే టైటిల్ ని పరిశీలనలో ఉంచారు. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం తెలుగమ్మాయి అంజలిని ఫైనలైజ్ చేసాం అని ఇదివరకే తెలియజేశాం.

పక్కా మాస్ మసాలా సాంగ్ గా ఉండనున్న ఈ సాంగ్ కోసం అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఓ స్పెషల్ సెట్ వేస్తున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సాంగ్ లో స్టెప్స్ థియేటర్స్ లో ఆడియన్స్ కి పూనకాలు వచ్చేలా ఉండాలని చెప్పడంతో కొరియోగ్రాఫర్ స్పెషల్ గా బన్ని కోసం స్టెప్స్ కంపోజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంటిన్యూగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు