“గ్యాంగ్ స్టర్ గంగరాజు” నుండి విడుదల అయిన “ఎల్లా ఎల్లా సాంగ్”

Published on Dec 5, 2021 6:04 pm IST


వలయం సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరో లక్ష్ చదలవాడ. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్ స్టర్ గంగరాజు. విభిన్నమైన కథ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కు ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తుండగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకం పై పద్మావతి చదలవాడ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

చదలవాడ బ్రదర్స్ సమర్పణలో రాబోతున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట కూడా విడుదల అయ్యింది. ఎల్లా ఎల్లా అంటూ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ పాటకి సంగీత దర్శకుడు సాయి కార్తీక్ సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం సమకూర్చారు. పీసి ఖన్నా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.

ల‌క్ష్ చ‌ద‌ల‌వాడ‌, వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌, న‌న్నిమాల‌, స‌మ్మెట గాంధీ, రాజేంద్ర‌, అను మాన‌స‌, లావ‌ణ్య రెడ్డి, అన్న‌పూర్ణ త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శ‌క‌త్వం ఇషాన్ సూర్య‌, నిర్మాత‌ చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి, సినిమాటోగ్ర‌ఫీ క‌ణ్ణ పి.సి, సంగీతం సాయి కార్తీక్‌, ఎడిట‌ర్‌ అనుగోజు రేణుకా బాబు, ఫైట్స్‌ డ్రాగ‌న్ ప్ర‌కాశ్‌, కొరియోగ్రాఫ‌ర్స్‌ భాను, అనీష్‌, పి.ఆర్‌.ఓ సాయి స‌తీశ్‌, ప‌ర్వ‌త‌నేని రాంబాబు లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :