రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘ఏమో ఏమో ఇది’.. ఎప్పుడంటే..?

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘ఏమో ఏమో ఇది’.. ఎప్పుడంటే..?

Published on Sep 21, 2026 5:00 PM IST

యంగ్ హీరో రోషన్ మేక, అందాల భామ ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ చిత్రం ‘ఏమో ఏమో ఇది’. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది.

ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ సాలిడ్ పోస్టర్‌ను కూడా వారు రిలీజ్ చేశారు. రోషన్, ప్రీతి ముకుందన్ ప్రేమలో మునిగి తేలుతున్న ఈ క్యూట్ పోస్టర్ సినిమాపై ఆసక్తి క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రంలోని లవ్ స్టోరి ప్రేక్షకులను కట్టిపడేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ఆకట్టుకునే పాటలు, అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు ఈ చిత్రం రెడీ అవుతుంది.

తాజా వార్తలు