డైరెక్టర్ వివి వినాయక్ తన రాబోయే సినిమా ‘అల్లుడు శీను’ విజయంలో చాలా నమ్మకంగా ఉంటున్నాడు. ఈ సినిమా జూలై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కొత్త హీరో నటించినప్పటికీ కమర్షియల్ విలువలు మాత్రం పుష్కలంగా ఉండనున్నాయి.
ఈ సినిమా గురించి వివి వినాయక్ మాట్లాడుతూ ‘ఎప్పటిలానే నా సినిమాల్లో ఉండే యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. దానితో పాటు కామెడీ మరియు సెంటిమెంట్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. శ్రీనివాస్ – సమంత లవ్ ఎపిసోడ్ లో ఒక ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంటుంది. ఇది ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుందని’ అన్నాడు.
అల్లుడు శీను సినిమాతో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయం కానున్నాడు. తమన్నా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.


