తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఈ నగరానికి ఏమైంది’. యూత్ లో ఈ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే, ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. ‘ఈ నగరానికి ఏమైంది’ విడుదలై ఎనిమిదేళ్లు అయిన సందర్భంగా నేడు ఈ సీక్వెల్ విడుదల తేదీని పంచుకుంటూ మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. కాగా నవంబర్ 19న ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలిపారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
‘ఈ నగరానికి ఏమైంది’ ఓటీటీలోనూ ట్రెండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే రీ-రిలీజ్‌లోనూ ఊహించని కలెక్షన్లను వసూళ్లు చేసింది. కాబట్టి, ఈ సినిమా సీక్వెల్‌ను తీయాలని టీమ్ భావించింది. పైగా ఈ సీక్వెల్లో నందమూరి బాలకృష్ణ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు గతంలో రూమర్స్ వినిపించాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


