ఈNఈ రిపీట్: ఈ ముగ్గురుపై స్పెషల్ అప్లాజ్!

ఈNఈ రిపీట్: ఈ ముగ్గురుపై స్పెషల్ అప్లాజ్!

Published on Nov 20, 2026 9:04 AM IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు తరుణ్ భాస్కర్ కలయికలో వచ్చిన లేటెస్ట్ సినిమానే ఈ నగరానికి ఏమైంది సీక్వెల్. యువతలో కల్ట్ స్టేటస్ దక్కించుకున్న మొదటి పార్ట్ కి కొనసాగింపుగా వచ్చిన ఈNఈ రిపీట్ కి కూడా సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. అయితే ఈ సినిమాలో వర్క్ అయ్యిన చాలా అంశాల్లో ఓ ముగ్గురు కోసం మాత్రం ఎక్కువ ఆడియెన్స్ మాట్లాడుకుంటున్నారు.

ఆ ముగ్గురే దర్శకుడు తరుణ్ భాస్కర్ తో పాటుగా హీరో విశ్వక్ సేన్ మరియు నటుడు అభినవ్ గోమఠం. ఈ ముగ్గురు వర్క్ సినిమాకి బిగ్ ప్లస్ గా నిలిచినట్టు సోషల్ మీడియాలో కూడా మాట్లాడుకుంటున్నారు. అభినవ్ సినిమాలో ఉన్నంతసేపు తనదైన కామెడీ పెర్ఫామెన్స్ తోనే కాకుండా ఓ కీలకమైన ఎమోషనల్ సీన్ ని కూడా అద్భుతంగా పండించడం, ముఖ్యంగా విశ్వక్ సేన్ లోని అసలు పెర్ఫార్మర్ ని ఈ సినిమా చూపించినట్టు చాలామంది చెబుతున్నారు.

విశ్వక్ ఇలాంటి సినిమాలు, పాత్రలు చేయాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇక కెప్టెన్ ఆఫ్ ది షిప్ తరుణ్ భాస్కర్ వర్క్ పై కూడా ప్రశంసలు వస్తున్నాయి. సీక్వెల్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడా అని అనుకున్న ఫ్రెండ్స్ బ్యాచ్ కి మరోసారి బ్యూటిఫుల్ సినిమా అందించాడు అని అంటున్నారు. విశ్వక్ దర్శకత్వం బదులు ఇలాంటి పాత్రలు, తరుణ్ నటన బదులు దర్శకత్వం లోనే ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు.

తాజా వార్తలు