మన టాలీవుడ్ దగ్గర ఉన్నటువంటి పాపులర్ నిర్మాణ సంస్థల్లో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒకరు. వారితో దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో వచ్చిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ చిత్రమే ‘418’. దర్శకుడు నాద గౌడ తెరకెక్కించిన ఈ సినిమాలో యువ నటుడు చైత్ర జే ఆచార్, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల నటించారు.
విడుదలకి ముందు సెన్సార్ నే భయపెట్టిన సినిమా అంటూ ప్రచారం చేస్తూ వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో ఆడియెన్స్ ని ఆడియెన్స్ ని ఆ రేంజ్ లో భయపెట్టలేకపోయింది. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఓటిటిలో ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమాని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేస్కుకోగా అందులో నేటి నుంచి ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. సో అప్పుడు ఎవరైనా మిస్ అయ్యి ఓటిటిలో చూడాలి అనుకునేవారు చూడొచ్చు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


