కిర్రాక్ పుట్టిస్తున్న “సాహో” సైకో సైయాన్ సాంగ్ టీజర్

కిర్రాక్ పుట్టిస్తున్న “సాహో” సైకో సైయాన్ సాంగ్ టీజర్

Published on Jul 5, 2019 10:55 AM IST

నిన్న చెప్పిన విధంగానే “సాహో” సైకో సైయాన్ సాంగ్ టీజర్ ని కొద్దిసేపటి క్రితం విడుదల చేయడం జరిగింది.ఓ పబ్ వాతావరణంలో బ్యూటీ శ్రద్దా కపూర్ హాట్ స్కర్ట్ లో హీటెక్కించే స్టెప్స్ వేస్తుంటే , ప్రభాస్ కూడా తనదైన స్టైల్ లో ఆ పాటకి కాలు కదిపారు. 30సెకెన్ల నిడివిగల ఈ టీజర్ రిచ్ గా ఉంది. పూర్తి పాటను ఈ నెల 8న విడుదల చేస్తున్నట్లు ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

ఈ పాటకు బాలీవుడ్ కంపోజర్ తనిష్క్ బాఘ్చి స్వరాలు అందించగా,శ్రీజో రచించడం జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కానున్న ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. యూవీ క్రియేషన్స్,టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్,మురళి శర్మ,వెన్నెల కిషోర్,జాకీ ష్రాఫ్ వంటి నటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

సాంగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు