ఎంటర్టైన్మెంట్ ప్రధానపాత్రలో ‘పండగ చేస్కో’

ఎంటర్టైన్మెంట్ ప్రధానపాత్రలో ‘పండగ చేస్కో’

Published on May 26, 2015 3:48 AM IST

Pandaga-chesko
గత కొన్ని చిత్ర్తాలుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ కి ఈ వారంతరం విడుదలకానున్న ‘పండగచేస్కో’ చిత్రం కీలకంగా మారనుంది. సెన్సార్ వ్యవహారాలు ముగించుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 29న విడుదలకానుంది. సమాచారం ప్రకారం ఈ చిత్రంలో జతచేసిన ఎంటర్టైన్మెంట్ పైనే చిత్ర బృందం ఆశలన్నీ పెట్టుకున్నారు. ద్వితీయార్ధంలో పండనున్న కామెడీ సన్నివేశాలపై ఈ సినిమా భవిష్యత్తు ఆధారపడనుందని తెలుస్తుంది.

డాన్ శ్రీను, బలుపు వంటి కమర్షియల్ విజయాలను అందుకున్న గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. రకుల్ ప్రీత్ సింగ్ మరియు సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో హీరోయిన్స్. బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణ కామెడి బాధ్యతలు మోశారు. పరుచూరి కిరీటి నిర్మాత. థమన్ సంగీతాన్ని అందించాడు.

తాజా వార్తలు