గత మిస్ మహారాష్ట్ర ఎరికా ఫెర్నాండేజ్ కన్నడలో ఒక భారీ ఆఫర్ ను అందుకుంది. కన్నడ లో తన మొదటి చిత్రాన్నే అక్కడ సూపర్ స్టార్ అయిన పునీత్ రాజ్ కుమార్ తో కలిసిచెయ్యనుంది. ఈ సినిమాకు జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకు ‘నిన్నిడాలే’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు సమాచారం. విజయ్ కిరణ్ గందుర్ ఈ సినిమాకు నిర్మాత. ఆగష్టు 12 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఇదివరకు ఎరికా ఫెర్నాండేజ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోతున్న సినిమాలో కనిపిస్తుందని పుకార్లు వచ్చాయి. అయితే వాటికి ఎరికా ఫెర్నాండేజ్ వెంటనే స్పందించి సమాధానం ఇచ్చింది. ఈ భామ ఇప్పటికే ‘డేగ’ అనే తెలుగు సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ఇంకా విడుదలకాలేదు. ఆమె భరత్ సరసన నటించిన తమిళ సినిమా ‘555’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడలో ఈ భారీ ప్రాజెక్ట్ కాకుండా తెలుగులో మరో కామెడీ సినిమాలో సైతం ఆమెను ఎంచుకున్నారట. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు
పునీత్ రాజ్ కుమార్ తో జతకట్టనున్న ఎరికా ఫెర్నాండేజ్
పునీత్ రాజ్ కుమార్ తో జతకట్టనున్న ఎరికా ఫెర్నాండేజ్
Published on Jul 23, 2013 9:00 PM IST
సంబంధిత సమాచారం
- పవర్ఫుల్ పోస్టర్ తో విజయ్ ‘రణబాలి’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది!
- ‘ది ప్యారడైజ్’ నెక్స్ట్ సాంగ్ కి డేట్స్ వచ్చేశాయ్!
- నైజాంలో ‘టాక్సిక్’ డే 1 ఓపెనింగ్స్ ఎంతంటే!
- ఒక్క రోజు రిలీజ్ ‘టాక్సిక్’తో సమానంగా ‘ఇరుముడి’ బుకింగ్స్!
- RC 17: రామ్ చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్ అంతకు మించే అంటున్న నిర్మాత!
- రామ్ పోతినేని క్రేజీ ప్రాజెక్ట్ కూడా వెనక్కి తగ్గేది లేదా!?
- సమీక్ష : ‘టాక్సిక్’ – స్టైల్ ఉన్నా.. సోల్ లేని పీరియాడిక్ డ్రామా!
- ‘ప్యారడైజ్’ మ్యాడ్నెస్ నెక్స్ట్ లెవెల్లో ఉండాల్సిందే..!
- రవితేజ సినిమాకు టైటిల్ మార్చారా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ‘టాక్సిక్’ – స్టైల్ ఉన్నా.. సోల్ లేని పీరియాడిక్ డ్రామా!
- 2026 కంబ్యాక్ నామ సంవత్సరం: వరుస హిట్స్ తో మళ్ళీ ఫామ్ లోకి పాపులర్ స్టార్స్
- హౌస్ఫుల్ షోలతో యశ్ ‘టాక్సిక్’ !
- షాకింగ్ : ‘స్పిరిట్’కు A సర్టిఫికెట్ ఖాయమని తేల్చిన సందీప్ రెడ్డి వంగా
- డిజాస్టర్ ‘పంజా’ మేనియా మరోసారి షురూ.. 4 షోస్ తోనే ట్రెండింగ్ బుకింగ్స్!
- అభిమానులకు ‘టాక్సిక్’ నిర్మాతలు ప్రత్యేక విజ్ఞప్తి !
- నాగార్జున కూడా ఆ రేస్లోనే దిగుతాడా..?
- ‘ఇరుముడి’ పై ‘పెద్ది’ రామ్ చరణ్ రెస్పాన్స్ వైరల్!


