శ్రీమంతుడు’ని హిట్ చేసిన అందరికీ థ్యాంక్స్ : ఎరోస్

శ్రీమంతుడు’ని హిట్ చేసిన అందరికీ థ్యాంక్స్ : ఎరోస్

Published on Aug 22, 2015 3:16 PM IST

srimanthudu
‘శ్రీమంతుడు’.. సూపర్ స్టార్ మహేష్ కెరీర్లో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోన్న సినిమా. నేనొక్కడినే, ఆగడు లాంటి రెండు వరుస అపజయాల తర్వాత మహేష్ చేసిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలనూ దక్కించుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. మహేష్ గత చిత్రాలైన నేనొక్కడినే, ఆగడు సినిమాలను విడుదల చేసిన ఎరోస్ సంస్థ ఈ సినిమానూ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసింది.

ఆగష్టు 7న మహేష్ పుట్టినరోజుకు రెండు రోజుల ముందే విడుదలై సంచలనం సృష్టిస్తూ వెళుతోన్న ‘శ్రీమంతుడు’ సినిమాలోని సోషల్ మెసేజ్‌కు అన్నిచోట్లా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఊరిని దత్తత తీసుకొని, బాగుపరిచే శ్రీమంతుడి కథగా ఈ సినిమా రూపొందింది. ఇక మహేష్ గత చిత్రాలు నిరాశపరచినా, ఎరోస్ సంస్థ శ్రీమంతుడు సినిమాపై నమ్మకం ఉంచింది. ఆ నమ్మకాల్ని నిజం చేస్తూ సినిమా బంపర్ హిట్ కొట్టడంతో ఎరోస్ సంస్థ సంతోషం వ్యక్తం చేసింది. తెలుగులో తమకు ఇంత పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టి, బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులకు ఎరోస్ సంస్థ ఈ సందర్భంగా థ్యాంక్స్ తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు