ఊటీలో ‘ఎర్రబస్సు’ పాటల చిత్రీకరణ

ఊటీలో ‘ఎర్రబస్సు’ పాటల చిత్రీకరణ

Published on Sep 24, 2014 10:41 AM IST

dasari-narayana-rao-manchu-
మంచు విష్ణు, కేథరిన్‌ జంటగా దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘ఎర్రబస్సు’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. సెప్టెంబర్ 20వ తేదీతో రామోజీ ఫిల్మ్ సిటీలో తాజా షెడ్యూల్ ముగిసింది. రెండు పాటలు, కొంత ప్యాచ్‌ వర్క్‌ షూటింగ్ చేయవలసి ఉంది. ఆ రెండు పాటల్ని ఊటీలో చిత్రీకరించనున్నారు.

తాతామనవళ్ల కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చివరి 30 నిమిషాలు చూసి ప్రేక్షకులు థ్రిల్‌ అవడం ఖాయమంటున్నారు. నటుడిగా దాసరి మరోసారి అద్బుతమైన ప్రతిభ కనబరిచారని సమాచారం. తమిళంలో సంచలన విజయం సాదించిన ‘మాంజ పాయ్’కి రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా దాసరి 151వ సినిమా కావడం విశేషం. చిల్డ్రన్స్‌ డే కానుకగా ఈ సినిమాను నవంబర్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు