పుష్ప 2లో ఇషా గుప్తా.. పాత్ర అదే !

Published on Jun 20, 2022 10:00 pm IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పుష్ప 2 కోసం బన్నీ ఫుల్ బిజీగా ఉన్నాడు. కాగా పుష్ప 2 లో మరో సీనియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉందని, ఆ క్యారెక్టర్ లో బాలీవుడ్ నటి ఇషా గుప్తా నటించబోతుందని తెలుస్తోంది.

నిజానికి ఇషా గుప్తా పుష్ప పార్ట్ 1 లోనే ఐటమ్ సాంగ్ చేయాల్సింది. ఆ సాంగ్ సామ్ చేసింది. అందుకే.. ఇషా గుప్తా మరో కీలక పాత్రలో కనిపించబోతుంది. ఏది ఏమైనా ‘పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది. పుష్పరాజ్ లాంటి పాత్రను స్టార్ హీరో చేసి మెప్పించడం చాలా రిస్క్. బన్నీ ఆ రిస్క్ ను బాగా హ్యాండిల్ చేశాడు. పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :