అంచనాలు పెంచేస్తున్న వరుణ్ తేజ్ – ‘ముకుంద’

అంచనాలు పెంచేస్తున్న వరుణ్ తేజ్ – ‘ముకుంద’

Published on Sep 2, 2014 10:58 AM IST

mukunda1
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘ముకుంద’ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేశారు. ఈ చిత్రంతోనే మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు.

‘ముకుంద’ ఫస్ట్ లుక్ టీజర్ క్లీన్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫీలింగ్ కలిగించింది. తొలి సినిమాతోనే యాక్షన్ హీరో ఇమేజ్ పడకుండా జాగ్రత్త పడ్డాడు వరుణ్ తేజ్. తన లుక్స్, స్మైల్, అప్పీల్ తో అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మెగా వారసుడి సినిమాగా ‘ముకుంద’పై భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. వాటిని మరింత పెంచేశాడు వరుణ్ తేజ్.

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న ఈ ఆరడుగుల అందగాడు భవిష్యత్లో యంగ్ హీరోలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు. టీజర్ ఎండింగ్ లో అతని కటౌట్ చూస్తే కమర్షియల్ మాస్ హీరోకి కావాల్సిన అర్హతలు వరుణ్ తేజ్ లో ఉన్నాయనే సంగతి అర్ధమవుతుందని అంటున్నారు.

ఠాగూర్ మధు సమర్పణలో లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఫేం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. పూజ హెడ్గే హీరోయిన్.

‘ముకుంద’ టీజర్ చూడడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు