మొదలైన ‘రభస’ హంగామా.!

మొదలైన ‘రభస’ హంగామా.!

Published on Aug 28, 2014 7:44 PM IST

rabhasa12

రేపు తెలుగువారు ఎంతో ఘనంగా జరుపుకునే వినాయక చవితి.. కానీ యంగ్ టైగర్ ఎన్.టి.అర్ అభిమానులను చూస్తుంటే వారికి మాత్రం ఒకరోజు ముందే వినాయక చవితి వచ్చేసిందా అనిపిస్తోంది. దానికి కారణం ఎన్.టి.ఆర్ నటించిన ‘రభస’ సినిమా రేపు వినాయక చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుండడం. రభస రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రతి ప్రాంతంలోనూ థియేటర్ మొత్తాన్ని అభిమానులు తన ఇష్ట హీరో ఎన్.టి.ఆర్ కటౌట్స్ మరియు బ్యానర్స్ తో నింపేశారు. థియేటర్ మొత్తాన్ని ఎన్.టి.ఆర్ అభిమానులు ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతునదని నమ్మడమే కాకుండా, అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అవుతుండడం వల్ల ఫస్ట్ వీక్ రికార్డ్ కలెక్షన్స్ కూడా వస్తాయని ఆశిస్తున్నారు.

సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఎన్.టి.ఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటించారు. బెల్లంకొండ గణేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు. మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు