ఎవరు మూవీ నైజాం 5రోజుల కలెక్షన్స్ రిపోర్ట్.

Published on Aug 20, 2019 6:53 pm IST

అడివి శేషు, రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ఎవరు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వారాంతపు సెలవుదినాలను మంచి వసూళ్లతో ముగించిన ఈ చిత్రం వీక్ ఎండ్ తరువాత కూడా నిలకడగా వసూళ్లు సాధిస్తుంది. ముఖ్యంగా ఏ సెంటర్స్ తో పాటు, ముల్టీఫ్లెక్స్ లలో ఈ మూవీ మంచి వసూళ్లను రాబడుతుందని సమాచారం.

కాగా నైజాంలో సోమవారం ఈ చిత్రం 24లక్షల షేర్ రాబట్టింది. దీనితో కలిపి మొత్తం ఐదు రోజులకు గాను, 2.54 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ షేర్ సాధించింది. మరో వైపు రణరంగం చిత్రం బాక్సాఫీస్ వద్ద డల్ కావడంతో ఈ మూవీ వసూళ్లకు అనుకూలాశంగా మారింది. వచ్చే వారం పెద్ద సినిమాల విడుదల లేకపోవడం తో ఎవరు చిత్రం రన్ పూర్తి అయ్యేనాటికి 3.50 కోట్ల షేర్ రాబట్టే అవకాశం కలదని ట్రేడ్ వర్గాల అంచనా.

సంబంధిత సమాచారం :

More