ఎవరు, రణరంగం నైజాం కలెక్షన్స్ లో ఎవరిదీ పైచేయి…!

Published on Aug 19, 2019 11:34 am IST

శర్వానంద్ నటించిన రణరంగం, అడివి శేషు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఎవరు చిత్రాలు స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఈనెల 15న విడుదల కావడం జరిగింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఎవరు మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా, రణరంగం చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. కాగా ఆ ఫలితం రెండు చిత్రాల వసూళ్లపై కూడా ప్రభావం చూపించింది.

నైజాంలో ఈ మూవీ మొదటి ఆదివారానికి కాను 60లక్ష షేర్ సాధించి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక వారాంతం పూర్తయ్యే నాటికి నాలుగు రోజులకు గాను ఈ చిత్రం నైజాం ఏరియాలో 2.30 కోట్ల షేర్ రాబట్టింది. ఇక రణరంగం పరిస్థితి మాత్రం కొంచెం భిన్నంగా ఉంది. మొదటి రోజు వసూళ్ళలో పర్వాలేదు అనిపించిన ఈ చిత్రం తరువాత బాక్సాఫీస్ వద్ద ఆ ఊపుని కొనసాగించలేక పోయింది. నిన్న ఆదివారం కేవలం 25లక్షల షేర్ సాధించిన రణరంగం దీనితో కలుపొకొని నాలుగు రోజులకు గాను 1.94 కోట్ల షేర్ రాబట్టిందని తెలుస్తుంది. ఇక ఈ రెండు చిత్రాలు పనిదినాలైన సోమవారం నుండి ఏమాత్రం వసూళ్లు సాధిస్తాయో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :