‘ఓజి’ కూడా వచ్చేస్తుంది.. ‘దేవర’ జాడెక్కడ?

‘ఓజి’ కూడా వచ్చేస్తుంది.. ‘దేవర’ జాడెక్కడ?

Published on Jul 22, 2026 12:00 AM IST

మన టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మాస్ స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ లు కూడా ఒకరు. వీరి సినిమాల ఓపెనింగ్సే చెప్తాయి వీరి స్టామినా ఏంటి అనేది. అలా వీరి నుంచి లేటెస్ట్ గా వచ్చిన చిత్రాలే ఓజి మరియు దేవర. అయితే ఈ సినిమాలు రెండూ థియేటర్స్ లో మంచి ఆదరణ అందుకొని ఓటిటిలోకి వచ్చాయి.

కానీ అక్కడ నుంచి టెలివిజన్ తెరపైకి రావడానికి మాత్రం ఇంకా చాలా సమయం తీసుకోవాల్సి వచ్చింది. నిజానికి ఓజి సినిమా ప్లేస్ లో దేవర ముందు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అక్కడ నుంచి ఓజి ఏడాది ఆలస్యంగా విడుదల అయ్యింది. ఇంత గ్యాప్ తీసుకున్నప్పటికీ ఓజి సినిమా అప్పుడే టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధం అయ్యిపోయింది కానీ దేవర జాడ మాత్రం ఇంకా అగుపడలేదు.

ప్రస్తుతం ఓజి సినిమాని ఈటీవీ వారు సొంతం చేసుకొని టెలికాస్ట్ ని త్వరలోనే అని కన్ఫర్మ్ చేశారు. ఇంట్రెస్టింగ్ గా దేవర సినిమా హక్కులు కూడా ఇదే ఛానెల్ వారు సొంతం చేసుకున్నట్టు బజ్ వినిపించింది. కానీ దీని కంటే ఓజి ముందు వచ్చేస్తుంది. సో దేవర కథ మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉందని చెప్పాలి. దీనిపై కూడా వారు ఏమన్నా క్లారిటీ ఇస్తారో లేదో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు