తెలుగువారు గర్వంగా చూడాల్సిన సినిమా !

Published on Apr 5, 2021 2:00 pm IST

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వైల్డ్ డాగ్”. ఇండియా లోనే బిగ్గెస్ట్ అండర్ కవర్ ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం సాలిడ్ ప్రమోషన్స్ నడుమ విడుదల అయ్యింది. అహిషోర్ సాలొమోన్ దర్శకత్వం వహించిన ఈ ఇంట్రస్టింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గురించి తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఒక ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టారు.

మెగాస్టార్ పోస్ట్ చేస్తూ.. ‘ఇప్పుడే వైల్డ్ డాగ్ చూసాను.తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అతి దారుణమైన టెర్రరిస్ట్ ఘాతుకం వెనుకవున్న కిరాతకులని పట్టుకున్న ఆ ఆపరేషన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. ఆ ఆవేశాన్ని,ప్రాణాలకి తెగించి ఆ నీచుల్ని వెంటాడి వేటాడిన మన రియల్ లైఫ్ హీరోలని, ఆ రియల్ హీరోలని మరింత అద్భుతంగా చూపించిన నా సోదరుడు అక్కినేని నాగార్జునకు అలాగే వైల్డ్ డాగ్ టీంని దర్శకుడు సోలమాన్, నిర్మాత నిరంజన్ రెడ్డిలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

ఇది ప్రతివారం విడుదలయ్యే చిత్రాల్లోఒకటి కాదు..ప్రతి ఒక్క భారతీయుడు,తెలుగు వారు గర్వంగా చూడవల్సిన చిత్రం..డోంట్ మిస్ దిస్. వాచ్ ఇట్’ అంటూ మెగాస్టార్ ఒక మెగా మెసేజ్ పెట్టారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా మ్యాట్నీ ఎంటెర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :