తెలుగులో విజయశాంతి అనుభవించిన స్టార్ట్ డమ్ బహుశా ఎవరు అనుభవించి ఉండరు.దశబ్దాల పాటు టాప్ హీరోయున్ గా కొనసాగిన విజయశాంతి హీరోయిన్స్ కి రోల్ మోడల్ గా నిలిచారు. చిరంజీవి, బాలయ్య వంటి టాప్ స్టార్స్ చిత్రాలలో కూడా వాళ్లతో సమానమైన పాత్ర ఉండేదంటేనే ఆమె స్టార్ డమ్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ వంటి బిరుదులు ఉన్న విజయశాంతి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు బ్రాండ్ అంబాసడర్ గా నిలిచారు.
అలాంటి విజయశాంతి దాదాపు 13ఏళ్ల తరువాత సరిలేరు నీకెవ్వరూ మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. నేడు దీపావళి సందర్భంగా ఆమె లుక్ ని విడుదల చేస్తున్నామని నిన్న ప్రకటించినప్పటి నుండి సినీ ప్రేమికులలో ఆసక్తి పెరిగిపోయింది. ఇన్నేళ్ల తరువాత మేకప్ వేసుకున్న విజయశాంతి ఎలా ఉండబోతున్నారు అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక నేడు సాయంత్రం 5:04నిమిషాలకు ఈ చిత్రం నుండి సెకండ్ అప్డేట్ రానుంది. మహేష్, రష్మిక మందాన జంటగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.


