ఓరి నాయనో… అందరి కళ్ళు కాలా ఆడియో ఆల్బమ్ పైనే

ఓరి నాయనో… అందరి కళ్ళు కాలా ఆడియో ఆల్బమ్ పైనే

Published on Apr 29, 2018 11:08 AM IST


తమిళ తలైవా, సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా, కబాలి చిత్రంతో సుపరిచితుడైన పీఏ రంజిత్ కాంబినేషన్లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం కాలా. ఒక గ్యాంగ్ స్టర్ కథానికతో రాబోతున్న ఈ చిత్రానికి రజినీ కాంత్ అల్లుడు ప్రముఖ తమిళ్ స్టార్ ధనుష్ నిర్మాతగా వహిస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమాలో కోలీవుడ్, టాలీవుడ్ మరియు బాలీవుడ్ స్టార్లు కూడా కొన్ని ప్రముఖ పాత్రల్లో నటించడం విశ్లేషకరం. కానీ ఎవరు నటిస్తున్నారు ఏ పార్తలు పోషిస్తున్నారు అన్న విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రజినీ జూన్ 7న తెర మీదకి రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ రిలీజ్ కి సంబందించిన బిజినెస్ రిజిస్ట్రేషన్ ప్కనుల్లో బిజీగా ఉంది.

రిలీజ్ సంగతి ఒకే, ఇక ఆడియో విషయానికి వస్తే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం మే 9 ఈ చిత్ర ఆడియో రిలీజ్ చేయడానికి సర్వత్రా సిద్దం చేయబోతున్నారు. కబాలి సినిమాకి సంగీతం అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి కూడా సంగీతం అందించాడు. ఇక ఈ మ్యూజిక్ మాంత్రికుని, మ్యూజిక్ కంపోజిషన్ ఎలా ఉంటుందన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కబాలీ చిత్రంతోనే అందరిని మెప్పించిన సంగతి తెలిసిందే. సినిమానే కాకుండా ఈ సినిమాకి సంబందించిన ఆడియో ఆల్బం కూడా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఆడియో రిలీజ్ రోజునే విడుదల చేయబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు