ప్రస్తుతం ఇండియన్ సినిమా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రం ‘రామాయణ’ ట్రైలర్ కోసమే అంతా మాట్లాడుకుంటున్నారు. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ గ్రాండ్ విజువల్ అండ్ ఎమోషనల్ డ్రామా నుంచి ఫస్ట్ ట్రైలర్ ని విడుదల చేయగా ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ ఇపుడు వినిపిస్తుంది.
అయితే ఈ ట్రైలర్ మొత్తంలో ఒక బిగ్ మిస్ ని ఆడియెన్స్ అంతా బాగా గమనించారు. అదే ఈ ట్రైలర్ లో ఎక్కడా హనుమాన్ కనిపించకపోవడం. బాలీవుడ్ స్టార్ నటుడు సన్నీ డియోల్ ఈ పవర్ఫుల్ పాత్ర పోషించారు కానీ ట్రైలర్ లో ఒక్క షాట్ కూడా తనపై లేకపోవడం రామాయణం ప్రేమికులని ఎంతో బాధించింది. అయితే ఇందుకు అసలు కారణం ఏంటి అనేది తెలుస్తుంది.
పార్ట్ 1 లో హనుమాన్ లేడా?
మేకర్స్ రెండు భాగాలుగా చేస్తున్న కారణంగా, ఈ కథ అందులోని ముఖ్యపాత్రలు వాటి ఆరంభం నుంచి తీసుకెళ్లే నేపథ్యంలో హనుమాన్ రోల్ మిస్ అయినట్టు తెలుస్తుంది. పార్ట్ 1 పూర్తయ్యేసరికి కథనంలో సన్నీ డియోల్ కనిపించకపోవచ్చట. సో అందుకే పార్ట్ 1 ట్రైలర్ లో ఎక్కడా తాను లేరని తెలుస్తుంది.
పార్ట్ 2 లో మాత్రం బీభత్సం..
పార్ట్ 1 లో మిస్ అయ్యిన సన్నీ డియోల్ పోషించిన హనుమాన్ పాత్ర పార్ట్ 2 లో గట్టిగా ఉంటుంది అని తెలుస్తుంది. ఇక్కడ మిస్ అయ్యింది అంతా పార్ట్ 2 లో హనుమాన్ పై అలాగే వానర సైన్యంపై సన్నివేశాలు పతాక స్థాయిలో ఉంటాయని టాక్.
సో రామాయణ విషయంలో ఈ క్లారిటీతో ఉంటే సరిపోతుంది. ఇక ఈ చిత్రానికి హన్స్ జిమ్మర్, ఏ ఆర్ రెహమాన్ లు సంగీతం అందిస్తున్నారు. అలాగే నమిత్ మల్హోత్రా, యష్ నిర్మాణం వహించగా ఈ నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ ఏడాది దీపావళి కానుకగా సినిమా విడుదల కానుంది.
