‘ఎవరు మీలో కోటీశ్వరులు’..తారక్ డెసిషన్ పై ప్రశంసల జల్లు.!

Published on Aug 24, 2021 8:01 am IST


ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరి దానితో పాటుగా దానికన్నా ముందే తెలుగు ఆడియెన్స్ ని పలకరించడానికి మరో బిగ్గెస్ట్ స్మాల్ స్క్రీన్ రియాలిటీ షో తో ముందుకొచ్చాడు. అదే “ఎవరు మీలో కోటీశ్వరులు”. ప్రముఖ టెలివిజన్ ఛానెల్ జెమినిలో ప్రసారం అవుతున్న ఈ గ్రాండ్ షో తన చిత్రం మరో స్టార్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా మొట్ట మొదటి ఎపిసోడ్ ని స్టార్ట్ చేశారు.

అయితే రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ ఎపిసోడ్ లో తారక్ తీసుకున్న ఓ నిర్ణయంపై ఆడియెన్స్ నుంచి సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది. ఈ షోకి ముందు మీలో ఎవరు కోటీశ్వరుడు అని ఉండే దానిని కానీ దానిని ఎవరు మీలో కోటీశ్వరులుగా మార్చింది తానే అని వివరణ ఇచ్చారు.

ఈ షోకి కేవలం మగవారు మాత్రమే కాకుండా ఆడవారు కూడా వస్తారు కదా అందుచేత కోటీశ్వరు’డు’ నుంచి కోటీశ్వరు’లు’ గా మార్పించానని తెలియజేసారు. దీనితో తారక్ ఉన్నతమైన ఆలోచన కు అందరి నుంచి కూడా ప్రశంసలు కురుస్తుండడమే కాకుండా ఇప్పుడు ఈ షో ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

సంబంధిత సమాచారం :