Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
ఇంటర్వ్యూ : సుమంత్ అశ్విన్ – సినిమాలో లాస్ట్ అర్ధగంట అందరికి నచ్చుతుంది !
Published on Jul 27, 2018 5:50 pm IST

సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’. ఈచిత్రం జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న సంధర్భంగా చిత్ర హీరో సుమంత్ అశ్విన్ మీడియా తో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

సినిమా ఎలా ఉంటుంది?
నేను చేసిన అన్ని సినిమాల్లో ఈ సినిమాకి ఎక్కువ పాజిటివ్ వైబ్రేషన్స్ కనపడుతున్నాయి. తప్పకుండ ఈ సినిమా ఫ్యూచర్ లో నేను పెద్ద బ్యానెర్లులో నటించేందుకు ఒక ప్లాట్ ఫామ్ గా నిలబడుతుంది అనుకుంటున్నా. సినిమాలో ముఖ్యంగా లాస్ట్ అర్ధగంట అందరికి నచ్చుతుంది. ఇప్పటికి ఎన్నోసార్లు సినిమా యూనిట్ మెంబెర్స్ అందరం చిత్రాన్ని చూశాం . అందుకని అంతగట్టిగా చెపుతున్నాను. సినిమా అందరికి నచ్చుతుంది.

ఇది ఏ టైపు సినిమా అని చెప్పుకోవచ్చు?
ఇది ఒకరకంగా లవ్ స్టోరీ నే కానీ, ఇదివరకు వచ్చినట్లుగా జనరల్ లవ్ స్టోరీ అండ్ మ్యారేజ్ సందర్భంగా వచ్చే లవ్ స్టోరీ అని కూడా చెప్పలేం. కాకపోతే ఒకరకంగా రొమాన్స్ డ్రామా విత్ ఫ్యామిలీ ఎమోషన్స్ అని చెప్పొచ్చు.

హ్యాపీ వెడ్డింగ్ అంటే పెళ్లి అనే కాన్సెప్ట్ గురించి మూవీ ఉంటుందా?

అదేం కాదండి, అసలు పెళ్లి బ్యాక్ డ్రాప్ అంటూ ఏమి ఉండదు. కాకపోతే ఒక పెళ్లి వాతావరణంలో ఒక కథ జరుగుతుంది. ఆ కథలో ఎవరి పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయి, పేరెంట్స్, అమ్మాయి, అబ్బాయి ఇలా వారి ఫీలింగ్ ఏంటి అనే దానిపైనే మూవీ ఉంటుంది. అది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది.

మీ పాత్ర ఏమిటి ఈ సినిమాలో?

అడ్వర్టైజింగ్ కంపెనీలో యాడ్స్ కి జింగిల్స్ రాస్తుంటారు కదా, ఆ జాబ్ చేస్తానండి సినిమాలో, నా పాత్రా పేరు ఆనంద్.

ఈ సినిమాలో విలన్ ఎవరు లేరని వార్త వస్తోంది నిజమేనా?

అంటే అది మీరు సినిమా చూసి చెప్పాలి. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య సాగే ఇటువంటి ఫ్యామిలీ బేస్డ్ మూవీలో విలన్ ఉన్నప్పటికీ ఆ పరిధి మేరకు ఉంటుంది. అయితే మా సినిమాలో విలన్ ఉన్నారా లేదా, ఎవరు విలన్ అనేది ముందే చెప్పలేను.

ఈ సినిమా వల్ల పెళ్లి గురించి తెలుసుకున్నాను అని అన్నారు ? ఏమి తెలుసుకున్నారు?

ఇటీవల జరిగిన మా కజిన్ పెళ్ళిలో అది చూసి కొంత తెలుసుకున్నాను అండి. పెళ్లి సమయంలో పేరెంట్స్, అన్న దమ్ములు అక్కాచెల్లెళ్లు, ముఖ్యంగా కుటుంభాల మధ్య అనుబంధం గురించి చాలా తెలుసుకున్నాను.

మీరు ఈ సినిమాను ఆగింకరించడానికి కారణం ?

డైరెక్టర్ లక్ష్మణ్ గారు నా దగ్గరకు వచ్చి, కథ చెప్పినపుడు లాస్ట్ అరగంటలో దాదాపు ఒక ఇరువై నిముషాలు వచ్చే డైలాగ్స్ మరియు ఆ సన్నివేశాలు చాలా నచ్చాయి నాకు. అలానే సినిమా కూడా ఎక్కడ బోర్ అనేది కొట్టకుండా వినోదాత్మకంగా సాగుతూ వెళ్తుంది.

నిహారిక మీతో కలిసి యాక్ట్ చేయడం పై మీ ఫీలింగ్ ఏంటి?

ఈ క్యారెక్టర్ కి నిహారిక అయితే బాగుంటుందని దర్శకుడు అనుకున్నారు. తను ఆ క్యారెక్టర్ కి పూర్తిగా న్యాయం చేసింది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ లో ఆమె నటన అద్భుతం. ఆ సీన్ లో ఆమె సరిగా చేయకపోతే సెకండ్ హాఫ్ ఇంపాక్ట్ ఉండదు. కానీ ఆ అమ్మాయి నటించిన తీరు సెకండ్ హాఫ్ మీద మంచి ఆసక్తిని తీసుకొస్తుంది.

మీ సొంత ప్రొడక్షన్ హౌస్ సుమంత్ ఆర్ట్స్ లో చాల సినిమాలు చేసారు. ప్రస్తుతం బయటి బ్యానర్ యువి క్రియేషన్స్ లో సినిమా చేయడం ఎలా ఉంది?

మాబ్యానర్ లో చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడకుండా అన్ని సినిమాలు మేము ఒకేలా అలోచించి ఎలా నిర్మించామో అలానే యువి సంస్థ వారు కూడా ఇప్పుడు తీస్తున్న ‘సాహో’ పెద్ద సినిమా స్థాయిలో ఎలా ఖర్చు పెడుతున్నారో, దీనికి కూడా ఎక్కడా కంప్రమైజ్ కాకుండా ఖర్చు పెడుతున్నారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ చేయడానికి వాళ్ళే ప్రధాన కారణం. వాళ్ళు లేకపోతే సినిమా ఇంత గ్రాండియర్ గా ఉండేది కాదేమో.

పెళ్లి పై మీ అభిప్రాయం ఏమిటి?

ఒక అమ్మాయిని నిజాయితీ గా ప్రేమిస్తే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఇప్పటివరకు ఏ అమ్మాయితో ప్రేమలో పడలేదు. ఫ్రెండ్స్ మాత్రం చాలా మంది ఉన్నారు. అందరూ ఏదో ఒక సమయంలో పెళ్లి చేసుకోవలసిందే. నాకు కూడా టైం వచ్చినపుడు జరుగుతుంది. కానీ సమయం పడుతుంది.

మీ పేరెంట్స్ ఎటువంటి పెళ్లి చేసుకోమంటున్నారు?
వాళ్లకి నేను ఎలా చేసుకున్న ఓకే. కాకపోతే ఆ అమ్మాయి మా పేరెంట్స్ కి కూడా నచ్చాలి కదండీ. వాళ్ళకి నచ్చితే నేను పెళ్లి చేసుకుంటాను. కానీ వాళ్ళు నా ఇష్టాన్ని కాదనరు అని నా ఫీలింగ్.

మీ క్యారెక్టర్, నిహారిక క్యారెక్టర్లలో ఎవరిది ఎక్కువ ఉంటుంది?

ఎక్కువ, తక్కువ అనేది నేను ఆలోచించలేదండి. క్యారెక్టర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని మాత్రమే ఆలోచించాను. నా క్యారెక్టర్, నిహారిక క్యారెక్టర్ ఇద్దరివీ కూడా సినిమాలో చాలా బాగుంటాయి. ఎవరిది ఎక్కువ సేపు ఉండే రోల్ అనేది మేము లెక్కవేసుకోలేదు. పెర్ఫార్మన్స్ ను బట్టి ఎవరికి వాళ్ళం ఇంకా బాగా నటిస్తే బాగుంటుంది అని అనుకున్నాం అంతే.

సంబంధిత సమాచారం :