‘రౌడీ జనార్దన’ క్లైమాక్స్ పై క్రేజీ న్యూస్ ?

Rowdy-Janardhana

విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్‌ కోలా తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన’. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పై వచ్చే ప్రీ క్లైమాక్స్ సీన్స్ అదిరిపోతాయట. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ అదిరిపోతోందని.. పైగా ఈ సినిమాకే కాకుండా, విజయ్ దేవరకొండ సినీ కెరీర్ లోనే ఈ సీక్వెన్స్ హైలెట్ గా నిలిచిపోతుందని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో వచ్చే ప్లాష్ బ్యాక్ లో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తాడట. పైగా విజయ్ దేవరకొండ యాక్షన్ సీన్స్ సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్ గా ఉంటాయట.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు రాజశేఖర్ పాత్ర అండ్ ఆయన లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్‌ నటించనుంది. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Exit mobile version