ఇంటర్వ్యూ : అనిల్ సుంకర – 3డి సినిమా తీయడం చాలా కష్టం మరియు అదొక చాలెంజ్

Published on Jun 20, 2013 5:50 pm IST

అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘యాక్షన్ 3డి’ సినిమాకి అనిల్ సుంకర దర్శకనిర్మాత. ఇండియా, తెలుగులో వస్తున్న మొట్ట మొదటి డైరెక్ట్ రియల్ 3డి సినిమా ఇది. రేపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అనిల్ సుంకర తో మేము కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాము. 3డి సినిమా తీయడానికి అతను ఎదుర్కొన్న ఇబ్బందులను, సినిమాటోగ్రాఫర్ – స్టీరియోగ్రాఫర్ మధ్య ఉన్న క్రియేటి విబేధాలను మాతో పంచుకున్నాడు. ఆ విశేషాలు మీకోసం..

ప్రశ్న) ఇప్పటి వరకూ తెలుగు సినిమా రంగలో రియల్ 3డి సినిమా రాలేదు. మీరు మీ మొదటి సినిమాకే అంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకున్నారు?

స) ఇది రిస్క్ కి సంబందించిన విషయం కాదు. 3డి అనేది ఇప్పుడిప్పుడే వస్తున్న కొత్త టెక్నాలజీ. ఈ రోజు కాకపోతే రేపన్నా వస్తుంది. కానీ దాన్ని పరిచయం చేసిన మొదటి వ్యక్తుల లిస్టులో మేము ఉండాలనుకున్నాం. మనం ఇప్పటి వరకూ హర్రర్, యాక్షన్ సినిమాలను 3డిలో చూసాం. కానీ కామెడీని 3డిలో చూపిస్తే చాలా కొత్తగా ఉంటుంది. తెలుగు ఆడియన్స్ కామెడీని బాగా ఎంజాయ్ చేస్తారు, వారికి ఏదన్నా కొత్త అనుభూతిని ఇవ్వాలనుకున్నాం. అందుకే ఈ కామెడీ సినిమాకి 3డిని జోడించాం.

ప్రశ్న) ఓ సినిమా 3డిలో తీయడం కూడా ఒక కొత్త అనుభవమే కదా..

స) అవును. సినిమాకోసం మనం ఎంచుకున్న కంటెంట్ అలానే ఉంటుంది కానీ మిగతా చాలా విషయాలు మారిపోతాయి. సరైన ఎఫెక్ట్ రావాలంటే చాలా విషయాల గురించి డీప్ గా తెలుసుకోవాలి. కొన్ని షాట్స్ 2డిలో షూట్ చేయాలంటే 10 నిమిషాలు సరిపోతుంది, కానీ 3డిలో ఆ షాట్స్ ఒక గంట సమయం తీసుకోవచ్చు. చాలా విషయాలు పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అని చూసుకొని తీయాలి ఇది స్లో ప్రోసెస్. ఈ సినిమా విషయంలో చాలా ఉపయోగకరమైన సమాచారం తెలుసుకున్నాం. మేము మాకు తెలియని విషయాలను త్వరగానే నేర్చుకున్నాం, నేర్చుకున్న తర్వాత నుంచి సినిమా చాలా వేగంగా పూర్తయిపోయింది.

ప్రశ్న) ఈ నాలెడ్జ్ తో మరో 3డి సినిమాతో త్వరలోనే మా ముందుకు రానున్నారా?

స) (నవ్వుతూ).. నా మొదటి సినిమా జర్నీలో బాగా అలసిపోయాను. ప్రస్తుతం బ్రేక్ తీసుకొని, ప్రస్తుతం మా బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమాల మీద దృష్టి పెట్టాలి. ఈ నాలెడ్జ్ ని కొద్ది కాలం తర్వాత మరో సినిమాకి వాడుతాం. భవిష్యత్తులో ఈ విషయాలు ఇంకా నులువుగా మారిపోతాయి.

ప్రశ్న) 3డి సినిమా తీయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాంటప్పుడు మీరు టాప్ హీరోలని ఎంచుకోకుండా అల్లరి నరేష్ ని ఎంచుకోవడానికి గల కారణం?

స) అల్లరి నరేష్ చేయకపోయి ఉంటే నేను ఈ సినిమా చేసేవాన్ని కాదు. తొలి చిత్ర దర్శకుడిగా నేను హీరోతో చాలా కంఫర్టబుల్ గా ఉండాలనుకుంటాను. నా మొదటి సినిమా అదీ 3డిలో తీయాలనుకున్నప్పుడు నేను పెద్ద హీరోల జోలికి వెళ్ళలేను. నరేష్ నన్ను నమ్మాడు, అలాగే మా ఇద్దరి వేవ్ లెంగ్త్ లు బాగా కలిసాయి. ఈ మూవీ షూటింగ్ టైంలో నరేష్ ఎంతో సపోర్ట్ గా ఉన్నాడు. ఒకవేళ నరేష్ చేయకపోయి ఉంటే ఈ సినిమా మరో సవత్సరం లేదా ఇంకాస్త ఆలస్యం అయ్యేది. మేము కొన్ని సీన్స్ కి మళ్ళీ మళ్ళీ డబ్బింగ్ చెప్పమని నరేష్ ని అడిగాం, నరేష్ ఎలాంటి కంప్లైంట్ చెయ్యకుండా చేసారు. నరేష్ తో ట్రావెల్ చాలా బాగుంది, కచ్చితంగా నరేష్ తో ఇంకో సినిమా తీస్తాను.

ప్రశ్న) మీకు ఇండస్ట్రీ నుంచి మోరల్ గా ఎలాంటి సపోర్ట్ వచ్చింది?

స) ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేసారు. ఈ సినిమా మొదలు పెట్టాలనుకున్న సమయంలో చాలా మంది నన్ను నిరుత్సాహపరచడానికి ట్రై చేసారు. ‘ ఇప్పుడు అంత కష్టపడటం ఎందుకండీ’ అని అన్నారు. కానీ మేము సీరియస్ గా తీసుకొని షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత అందరూ సపోర్ట్ ఇచ్చారు. ఫిల్మ్ వర్గాలు ఈ సినిమాని కేవలం 3డి లోనే తీస్తున్నానని అనుకున్నారు. బాలకృష్ణ గారైతే అందరికీ ‘ ఆయన 3డి సినిమా తీస్తున్నారు తెలుసా’ అని నన్ను అందరికీ పరిచయం చేసేవారు. మహేష్ బాబు, శ్రీను వైట్ల, మొదలైన వారు చాలా సపోర్ట్ చేసారు.

ప్రశ్న) అసలు ఎలా, ఎందుకు మూవీ ప్రొడక్షన్ వైపు వచ్చారు?

స) నాకు మొదటి నుంచి తెలుగు సినిమాలంటే విపరీతమైన ఇష్టం. నేను 1995 లో అమెరికా వెళ్లాను, ఇప్పటికీ నా మొదటి వ్యాపారం సాఫ్ట్ వేర్. రామ్ ఆచంట నాకు మంచి స్నేహితుడు, అతనికి సినిమా ప్రొడక్షన్ అంటే చాలా ఇష్టం. నాకు పర్సనల్ గా డైరెక్షన్ అంటే ఆసక్తి, కానీ నేను మొదట నిర్మాతగా అడుగుపెట్టాను. దర్శకుడిగా నా డ్రీం సాకారం చేసుకునే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

ప్రశ్న) భవిష్యత్తులో కూడా మీరు ఏమన్నా సినిమాలు డైరెక్ట్ చేస్తున్నారా?

స) దాని గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. ఎంతో చాలెంజింగ్ గా చేసిన సినిమా కావడం వల్ల ‘యాక్షన్ 3డి’ విషయంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. భవిష్యత్తులో మరో కొత్త టెక్నాలజీ నన్ను ఆకట్టుకున్నా లేదా నటీనటుల మంచి కాంబినేషన్ కుదిరితే చేసే అవకాశం ఉంది.

ప్రశ్న) అమెరికన్ అయిన కీత్ డ్రైవర్ ని ఇండియాకి తీసుకు వచ్చారు. ఆయన్ని ఇంత లాంగ్ టైం ఇండియాలో ఉండటానికి ఎలా ఒప్పించారు?

స) ఆయన్ని ఒప్పిచందం చాలా ఈజీ. ఆయనకీ ఇండియన్ సినిమాలంటే గౌరవం ఎక్కువ అలాగే ఆసక్తి కూడా ఉంది. చాలా మంది మన సినిమాలో పనిచేయడానికి ఆసక్తి చూపుతారు. మేము ముందుగా ఇది 7 నెలల్లో అయిపోతుందని అనుకున్నాం. కానీ పలు కారణాలవల్ల అది కాస్తా 18 నెలల సమయం పట్టింది. అయినా ఆయన ఒక్కసారి కూడా కంప్లైన్ చెయ్యలేదు. అతను టీం లోని అందరితో ఈజీగా కలిసిపోయాడు, కష్టమైన కండిషన్స్ ని కూడా చాలా ఈజీగా తీసుకున్న ప్రొఫెషనల్. ఆయన 18 -19 గంటలైనా ఎలాంటి అలసట లేకుండా పనిచేయగలడు.

ప్రశ్న) అమెరికా కల్చర్ కి మన కల్చర్ పూర్తి విభిన్నంగా ఉంటుంది. కీత్ కి మిగతా టీం మెంబర్స్ కి మధ్య క్రియేటివ్ పరంగా ఏమన్నా తేడాలున్నాయా?
స) సినిమాటోగ్రాఫర్ సర్వేశ్ మురారి – కీత్ కి మధ కొన్ని క్రియేటివ్ తేడాలున్నాయి. కానీ అవన్నీ టెక్నికల్ పరంగానే పర్సనల్ గా కాదు. స్టీరియోగ్రాఫర్ గా లాంగ్ షాట్స్ తీసేటప్పుడు 3డి ఎఫ్ఫెక్ట్స్ విషయంలో కీత్ ఎంతో ఆసక్తిగా ఉంటాడు. సినిమాటోగ్రాఫర్ గా నటీనటుల ఎమోషన్స్ ని బందిచడంలో సర్వేశ్ ఆసక్తి చూపిస్తాడు. అది క్లోజ్ షాట్స్ కి అవసరం. చివరికి కాంప్రమైజ్ అయ్యి చేసే వాళ్ళం. పాటల్లో అద్భుతమైన 3డి ఎఫ్ఫెక్ట్స్ ని వాడాము, అలాగే టాకీ సీన్స్ పై కూడా అంతే శ్రద్ధ తీసుకున్నాం. వచ్చిన అవుట్ పుట్ విషయంలో మేము చాలా హ్యాపీ గా ఉన్నాం.

ప్రశ్న) అల్లరి నరేష్ ని ఇష్టపడే ఆడియన్స్ కి యాక్షన్ 3డి నచ్చుతుందా?

స) అవును నచ్చుతుంది, కానీ ఈ సినిమాతో అల్లరి నరేష్ ని టార్గెట్ చేసే ఆడియన్స్ ని పెంచాలనుకున్నాం. నరేష్ ని మేము మా బ్యానర్ హీరోగా అనుకుంటాం. మా బ్యానర్ లో చేసిన మొదటి సినిమా ‘ఆహనా పెళ్ళంట’ సినిమాలో నరేష్ అంతకముందు సినిమాలకంటే కొత్తగా చూపించాం మరియు ఆ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసాం. అలాగే ఇప్పుడు ‘యాక్షన్ 3డి’ తో కూడా హీరోగా నరేష్ రేంజ్ ని పెంచానున్నాం. ఇప్పటి వరకూ ఉన్న అల్లరి నరేష్ ఫ్యాన్స్ కూడా నిరుత్సాహానికి గురవ్వరు ఎందుకంటే వారిని ఎంటర్టైన్ చెయ్యడానికి చాలా కామెడీ సీన్స్ ఉన్నాయి.

ప్రశ్న) బప్పి లహరిని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకోవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకు ఆయన్ని ఎంచుకున్నారు?

స) మేము ఈ సినిమాలో అనుకున్న కొన్ని సాంగ్స్ కి బప్పి లహరి గారి ట్యూనింగ్ ఉంటే బాగుంటుంది అనుకున్నాం. అందుకే ఆయన్ని సెలెక్ట్ చేసాం. కానీ మున్నా కాశీ, చిన్ని చరణ్, సాయి కార్తీక్ లాంటి లోకల్ టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా సినిమా కోసం వాడుకున్నాం. సన్నీ ఈ సినిమాకి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు.

ప్రశ్న) ఈ సినిమాకి బడ్జెట్ బాగా ఎక్కువైంది కదా తిరిగి అంత వస్తుందా లేదా అని భయపడుతున్నారా?

స) సినిమా సక్సెస్ మీదే లాభాలు ఆధారపడి ఉంటాయి. సినిమా పరంగా చూసుకుంటే ఒక్క పైసా కూడా అనవసరంగా ఖర్చు చేయలేదు. మేము పెట్టిన ప్రతి ఒక్క రూపాయి మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది. విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉంటాయి. నాకు 3డి టెక్నాలజీ మీద కొంత అనుభవం లేకపోవడం వల్ల రీ షూట్స్ చేసాం. దాని వల్ల కొంత సమయం, మనీ ఖర్చు పెట్టాం. స్ట్రెయిట్ గా 3డి ఫిలిం తీయడం వల్ల కొన్ని అనుకోని సంఘటనలు ఎదుర్కోవలసి వచ్చింది. ప్రతి ఒక్కరూ అనుకున్నది అనుకున్నట్టుగా చేయలేకపోవచ్చు. నా వరకూ సినిమా బాగా వచ్చిందని అనుకుంటాను.

ప్రశ్న) పైరసీ విషయంలో ఏమన్నా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారా?

స) ఈ సినిమా విజువల్స్ చాలా గ్రాండ్ గా రావడం కోసం చాలా కష్టపడ్డాం. ఈ సినిమాని ప్రేక్షకులు థియేటర్ కి వెళ్ళే చూడాలి, 3డి అనుభూతిని ఫీల్ అవ్వండి. మీరు పైరేట్ లో సినిమా చూడాలనుకుంటే మీరు చాలా మిస్ అవుతారు. ఈ విషయాన్ని నేను వాళ్ళ ఇష్టానికే వదిలేస్తున్నాను.

ప్రశ్న) మామూలుగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. భవిష్యత్తులో చిన్న సినిమాలు చేసే అవకాశం ఉందా?

స) నేను చిన్న సినిమాలా లేదా పెద్ద సినిమాలా అని చూడను. రెండు రకాల సినిమాలకి ఒకే విధంగా కష్టపడతాను. నేను సినిమా స్టొరీ మీద దృష్టి పెడతాను. నాకు పెద్ద హీరోల సినిమా కాల్షీట్స్ దొరికితే బిగ్ బడ్జెట్ సినిమా చేస్తాను, ఒక వేల స్టొరీ కి చిన్న హీరో సరిపోతాడు అనుకుంటే చిన్న హీరోని ఎంచుకుంటాను.

ప్రశ్న) మా పాఠకులకు ఏమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా?

స) అవును. ఈ సినిమాని కొత్త టెక్నాలజీలో తీసిన కామెడీ సినిమాలాగా ట్రీట్ చెయ్యండి. స్క్రీన్ పై విజువల్స్ చాల అగ్రండ్ గా ఉంటాయి, మీరు నిరుత్సాహపడరు. పబ్లిసిటీ విషయంలో చాలా బాగా ప్రమోట్ చేస్తున్నందుకు 123తెలుగు.కామ్ ని అభినందిస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి రూమర్స్ రాయకుండా కేవలం నిజమైన వార్తలనే రాస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. నేను మీ సైట్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను.

మా గురించి ఇంత మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చినందుకు అనిల్ సుంకర గారికి మా ధన్యవాదాలు. ఆయనకి, యాక్షన్ 3డి టీం కి ఆల్ ది బెస్ట్ చెప్పి, అంతటితో మా ఇంటర్వ్యూని ముగించాం. థియేటర్లలో హై క్వాలిటీ 3డి సినిమా చూసి ఎంజాయ్ చెయ్యండి.

ఇంటర్వ్యూ – మహేష్ ఎస్ కోనేరు

అనువాదం – రాఘవ

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం :

X
More