ప్రత్యేక ఇంటర్వ్యూ : కృష్ణవంశీ – ‘గోవిందుడు..’ సినిమా చూసి చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.

ప్రత్యేక ఇంటర్వ్యూ : కృష్ణవంశీ – ‘గోవిందుడు..’ సినిమా చూసి చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.

Published on Sep 25, 2014 1:30 PM IST

krishna-vamsi
అతని సినిమాలు సహజత్వానికి దగ్గరగా, తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింభించేలా ఉంటాయి. తెలుగు చిత్రసీమలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు పొందిన దర్శకుడు కృష్ణవంశీ. కొంచం గ్యాప్ తర్వాత తనదైన మార్క్ తో ‘గోవిందుడు అందరివాడేలే’ అంటూ కుటుంబ కధా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 1న విడుదలవుతుంది. ఈ సందర్భంగా కృష్ణవంశీతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం..

ప్రశ్న) సినిమా షూటింగ్ పూర్తయింది. మీరు ఇప్పుడు రిలాక్స్ గా ఫీల్ అవుతున్నారా..?

స) ప్రస్తుతం నేను ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో చాలా బిజీగా ఉన్నాను.
సినిమా విడుదలయి, అది ప్రేక్షకులకు చేరువైనప్పుడు మాత్రమే నేను రిలాక్స్ గా ఫీల్ అవుతాను.

ప్రశ్న) ‘గోవిందుడు అందరివాడేలే’ దసరా కానుకగా రిలీజ్ అవుతోంది. మరి ఈ పండుగ సీజన్ లో బాక్స్ ఆఫీసు దగ్గర ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.?

స) నా పని దర్శకత్వం చేయడం మాత్రమే.. బాక్స్ ఆఫీసు కలెక్షన్స్, ప్రాఫిట్స్, మరి ఫైనాన్సియల్ కి సంబందించిన విషయాలను మా నిర్మాత చూసుకుంటాడు. నాకున్న ఫ్యాషన్ వల్ల సినిమాలు చేస్తాను. అంతేకాని ధనార్జన లేదా ఇతర లాభాలు ఆశించి చెయ్యను.

ప్రశ్న) ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా చెయ్యడానికి మొదట మీ మదిలో తట్టిన ఆలోచన ఏమిటి.?

స) నాగ గత సినిమాలు ఏవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అప్పుడే నేను తదుపరిగా ఏమిచెయ్యాలా అనే ఆలోచనలో పడ్డాను. అప్పుడే నా మదిలో ఈ సారి నేను కుటుంబ విలువలు మరియు మానవ సంబంధాల మధ్య ఉన్న బాంధవ్యాలపై సినిమా చేయాలని నిర్ణయించుకుని ఈ సినిమా కథ మొదలు పెట్టాను..

ప్రశ్న) ఇప్పటివరకూ రామ్ చరణ్ ఎక్కువగా యాక్షన్ ఎంటర్టైనర్స్ చేసారు. మరి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ఎంత డిఫరెంట్ గా కనిపించనున్నాడు.?

స) నేను ఎప్పుడూ చరణ్ ని యాక్షన్ హీరోలా చూడలేదు.. నా వరకూ తనొక సంపూర్ణ నటుడు.. నేను రాసుకున్న పాత్రకి పర్ఫెక్ట్ గా సరిపోతాడు. ఇక తన లుక్ మరియు పెర్ఫార్మన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది అనే విషయాలు తెలియాలంటే మీరు సినిమా విడుదలయ్యే వరకూ వేచి చూడాల్సిందే.. ప్రస్తుతానికి సస్పెన్స్…

ప్రశ్న) మీకు చిరంజీవి – రామ్ చరణ్ చాలా క్లోజ్ గా తెలుసు. మీ పరంగా మీరు ఇద్దరిలోనూ గమనించిన డిఫరెన్స్ ఏమిటి.?

స) చరణ్ ని చూసిన ప్రతి సారి నాకు చిరంజీవి గారే గుర్తుకు వస్తారు. మంచి అలవాట్లు, బిహేవియర్ లాంటివి తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్నాడు. నటన పరంగా మాత్రం ఇద్దరికీ డిఫరెంట్ స్టైల్ ఉంది.

ప్రశ్న) ‘గోవిందుడు అందరివాడేలే’లో శ్రీ కాంత్ నెగటివ్ రోల్ చేస్తున్నాడా.?

స) కాదు.. అది నెగటివ్ రోల్ కాదు.. విలేజ్ లో ఉండే టిపికల్ గా ఉంటూ పొగరుబోతు, బాగా రెబల్ గా తిరిగే కుర్రాడి పాత్ర. శ్రీ కాంత్ పాత్ర సినిమాకి చాలా అవసరం. తన పాత్రకి శ్రీ కాంత్ పూర్తిగా న్యాయం చేసాడు.

ప్రశ్న) చివరి దశలో ప్రకాష్ రాజ్ ని రీప్లేస్ చేసి చేయడం వలన సినిమాకి హెల్ప్ అయ్యింది అంటారా.?

స) అవును.. నాకు ప్రకాష్ రాజ్ తో క్లోజ్ రిలేషన్ ఉంది, అలాగే గొడవపడిన రిలేషన్ కూడా ఉంది. ప్రకాష్ రాజ్ గొప్ప నటుడు. మనం తనని ఏ పాత్రలోకి కావాలంటే ఆ పాత్రలోకి మౌల్డ్ చేసుకోవచ్చు. తను మాత్రం ది బెస్ట్ ఇస్తాడు. అలాగే తన వల్ల సినిమాకి చాలా సపోర్ట్ వస్తుంది.

ప్రశ్న) మరి ప్రకాష్ రాజ్ పాత్ర గోవిందుడు అందరివాడేలే కి హైలైట్ అవుతుందని అంటారా.?

స) అవును ప్రకాష్ రాజ్ సినిమాకి బాగా హెల్ప్ అవుతాడు. అలాగే ప్రస్తుత జెనరేషన్ లో మిస్ అవుతున్న మానవ సంబంధాలు, ఫ్యామిలీ రిలేషన్స్ సినిమాకి మెయిన్ హైలైట్ అవుతాయి.

ప్రశ్న) ఈ సినిమా చూసాక చిరంజీవి గారి రియాక్షన్ ఏమిటి.?

స) నేను ఈ సినిమా ఫైనల్ కట్ ని చిరంజీవి గారు మరియు ఆయన సతీమణికి చూపించాను. సినిమా చివరికి వచ్చేసరికి, వాళ్ళిద్దరూ కంటతడి పెట్టుకున్నారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే సరైన రీ రికార్డింగ్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేకుండానే వాళ్ళు నా సినిమాకి చాలా బాగా కనెక్ట్ అయ్యారు.

ప్రశ్న) బయట వస్తున్న వార్తల ప్రకారం చివరి 30 నిమిషాలు సినిమాకి మేజర్ హైలైట్ అంటున్నారు. మరి మీరేమంటారు.?

స) మొత్తం సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటుంది.

ప్రశ్న) బండ్ల గణేష్ గురించి మరియు ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పండి.?

స) ఇప్పటి వరకూ నేను పనిచేసిన నిర్మాతలలో బండ్ల గణేష్ ఇస్ ది బెస్ట్.. నాకు సినిమా పరంగా పూర్తి క్రియేటివ్ ఫ్రీడం ఇచ్చాడు. అలాగే నాకు ఏమి కావాలంటే అది లేదు, కాదు అనకుండా ఇచ్చాడు.

ప్రశ్న) మీ తదుపరి సినిమాల విశేషాలు చెప్పండి.?

స) ప్రస్తుతానికి నా తదుపరి ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. గోవిందుడు అందరివాడేలే మొత్తం పూర్తయ్యి రిలీజ్ అయ్యాక ఆ తర్వాత నేను తదుపరి సినిమా గురించి ఆలోచిస్తాను.

అంతటితో కృష్ణవంశీతో మా ప్రత్యేక ఇంటర్వ్యూని ముగించి ‘గోవిందుడు అందరివాడేలే’ మంచి విజయం అందుకోవాలని ఆల్ ది బెస్ట్ చెప్పాము..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు