ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: ‘కోన నీరజ’ – త్వరలోనే సినిమాకి దర్శకత్వం వహిస్తాను !

Published on Aug 3, 2020 12:00 pm IST

టాలీవుడ్ లో స్టైలింగ్ విషయానికి వస్తే కోన నీరజ అగ్రస్థానంలో ఉంది. దక్షిణాదిలో టాప్ స్టార్స్ అందరితో ఆమె ఏడు సంవత్సరాలకు పైగా అనేక సినిమాలు పని చేసింది. 123 తెలుగుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, నీరజ తన కెరీర్ గురించి, తన సినీ దర్శకత్వంలోకి ఎంట్రీ గురించి మాట్లాడారు. ఆ విషయాలు ఏంటో చూద్దాం.

 

ఈ లాక్ డౌన్ లో మీలో వచ్చిన మార్పులు ఏమిటి ?

 

లాక్ డౌన్ ప్రారంభంలో, నేను ఇంటి పట్టునే ఉండటానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఆ తరువాత పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్నాను. మనం ఇంట్లో ఎంత ఎక్కువ ఉంటామో, మనం అంత సురక్షితంగా ఉంటాము. ఇక ఈ లాక్ డౌన్ లో నేను వంట పట్ల కొత్త ప్రేమను పెంచుకున్నాను. నాకు ఎక్కువుగా వంట చేయడానికే టైం సరిపోతుంది.

 

మీ ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువుగా ఫుడ్ కి సంబంధించిన ఫొటోలే ఉన్నాయి ?

 

నేను ఎప్పుడూ ఫుడ్ ఫ్రీక్ గానే ఉన్నాను. ఫోటోలు ఎక్కువ ఉండటానికి అది కూడా ఒక కారణం. పైగా నేను హైదరాబాద్ లో ఒక రెస్టారెంట్ ను కూడా ప్రారంభించాను, అది నా ఫ్రెండ్ చూసుకుంటున్నారు. ఏమైనా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తయారు చేయడానికి కూడా ప్రేరణగా అలాంటి పిక్స్ తీస్తుంటాను.

 

మీ పుస్తకం ముగిసింది. మీరు రచనలోకి రావడానికి కారణమేమిటి?

 

నేను యూఎస్ లో ఉన్నప్పటి నుంచీ కవిత్వం రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాను. ఆ విధంగా ఒక ప్రచురణకర్త నన్ను సంప్రదించి, నా కొత్త పుస్తకం వేవ్స్ సాండ్ అండ్ మ్యాజిక్ పుస్తకం రూపంలో వచ్చింది. మేము ఇప్పటికే 4000 కాపీలు విక్రయించాము. ఇప్పటివరకు పుస్తకానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది.

 

మరి సినిమాలకు కూడా స్క్రిప్ట్స్ రాయాలనే ఆలోచన ఉందా?

 

అవును, నాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. అతి త్వరలో నా తొలి చిత్రానికి దర్శకత్వం వహిస్తాను. ప్రస్తుతానికి, నా మొదటి చిత్రం కోసం నేను కొంతమంది నటులను సంప్రదిస్తున్నాను. అలాగే, నా దగ్గర ఐదు బౌండెడ్ స్క్రిప్ట్‌లు సిద్ధంగా ఉన్నాయి మరియు రాబోయే సంవత్సరాల్లో వాటిని తెరకెక్కిస్తాను.

 

మీరు మీ కెరీర్‌ను 2013 లో ప్రారంభించారు. మీ కెరీర్‌ పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ?

 

టచ్‌వుడ్, నేను నా కెరీర్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. నేను యుఎస్ లో ఫ్యాషన్ మార్కెటింగ్ డిగ్రీ చేసి వచ్చాను. నా కజిన్ కోన వెంకట్ ఎన్టీఆర్ బాద్షా కోసం పనిచేస్తున్నప్పుడు. ఆయన స్టైలింగ్ చేయమని సూచించాడు. అప్పటి నుండి, నేను ఈ వృత్తిలోనే ఉన్నాను. ఇప్పటివరకు 68 సినిమాలకు పని చేశాను. ఇది సుదీర్ఘ ప్రయాణం.

 

టాలీవుడ్‌లో మహిళా స్టైలిస్ట్‌కు ఎలాంటి గౌరవం లభిస్తుంది?

 

మొదట్లో కొంచెం కష్టమే కాని ఇప్పుడు స్టైలిస్టులకు కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. నేను.. విజయ్, కార్తీ, సూర్య వంటి తమిళ స్టార్స్ తో కూడా పనిచేశాను. తమిళ పరిశ్రమ కూడా కొత్తగా ఉంది. వారు నన్ను ప్రోత్సహించారు. నా పనిని చాలా ఈజీ చేశారు. నేటి కాలంలో స్టైలింగ్ చాలా ముఖ్యమైనది.

 

కొత్తగా వివాహం చేసుకున్న నితిన్‌తో మీకున్న ప్రత్యేక బంధం గురించి చెప్పండి?

 

నితిన్ నేను చాలా కాలం నుండి మంచి స్నేహితులం. ఇప్పుడు అతను వివాహం చేసుకున్నందున చాలా సంతోషం. వాస్తవానికి, అతను తన ప్రేమ కథను మా అందరి నుండి చివరి వరకు దాచిపెట్టాడు. ఈ లవ్ మ్యారేజ్ తో అందరికీ షాక్ ఇచ్చాడు.

 

మీరు సినిమా ప్రమోషన్ల కోసం ప్రత్యేక రూపాలతో ఒక ధోరణిని సృష్టించారు. దాని గురించి చెప్పండి?

 

నేను ఎప్పుడూ హిందీ ఫ్యాషన్ ను ఇష్టపడుతాను. పెద్ద పత్రికలు మరియు ఫ్యాషన్ ఛానెల్‌ లు మన తెలుగు తారలను ఎందుకు సంప్రదించరో అనిపిస్తుంది. అప్పుడు, నేను, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ కోసం ప్రత్యేకంగా కనిపించే విధంగా డిజైన్ చేసిన దుస్తులతో ఫ్యాషన్ ఛానెల్‌ లు మన తారలను కూడా సంప్రదిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More