ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : వెన్నెల కిశోర్ – ‘ఆచార్య’లో నా రోల్ పై సూపర్ ఎగ్జైట్ తో ఉన్నాను.

Published on Apr 14, 2020 1:21 pm IST

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ కమెడియన్ గా తెలుగు తెర పై నవ్వుల వర్షం కురిపిస్తోన్న టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కమెడియన్ ‘ వెన్నెల కిశోర్ ‘. కాగా ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఫోన్ ద్వారానే ఆయనతో ప్రత్యేకమైన ఇంటర్వ్యూను తీసుకున్నాము. ఈ సందర్భంగా వెన్నెల కిశోర్ చెప్పిన ఆసక్తికరమైన విశేషాలు మీ కోసం..

 

ఈ ఘోరమైన కరోనా వైరస్ గురించి మీకేమనిపిస్తోంది ?

నేను కొన్ని రోజులుగా కరోనా గురించి తెలుసుకుంటున్నాను. వాస్తవానికి, ఇది చైనాలో ప్రారంభమైన సమయంలో నేను నితిన్‌తో కలిసి రంగ్ దే సినిమా షూటింగ్ లో ఉన్నాను. అప్పుడే మేము ఈ వ్యాధి గురించి చర్చించాము. మొదట రంగ్ దే చిత్రాన్ని లండన్‌లో చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ ఈ వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందగలదు కాబట్టి అక్కడ వద్దు అని చెప్పాను. ఏమైనా మనం ఇప్పుడు దారుణమైన పరిస్థితిలో ఉన్నాము.

 

లాక్ డౌన్ పరిస్థితిని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు?

కొద్ది రోజుల క్రితం, వెంకటేష్ గారు పోస్ట్ చేసిన బుద్ధుడి కొటేషన్ ఒకటి చదివాను, మనం ఫిర్యాదు చేస్తే మనల్నే బాధితులను చేస్తారు. అందుకే అలాంటి క్లిష్టమైన వాటిని వదిలివేయాలి లేదా మార్చాలి లేదా అంగీకరించాలి. దీని నుండి చాలా ప్రేరణ పొందొచ్చు. ప్రస్తుత పరిస్థితిని మనం అంగీకరించాలి.

 

ఈ లాక్ డౌన్ నుండి మీరు ఏమి నేర్చుకున్నారు?

డైలీ లైఫ్ లో బిజీ షెడ్యూల్స్ లో కొన్ని చిన్న విషయాలు మనం పెద్దగా పట్టించుకోము. అది మనం పెట్టే ఖర్చు కావొచ్చు, మన పనులు కావొచ్చు. వాటి గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం దొరికింది ఈ లాక్ డౌన్ తో. అలాగే మనం మిస్ అయినా మూవీస్ అండ్ ఫన్ ను కూడా ఈ ఖాళీ సమయంలో ఎంజాయ్ చెయ్యొచ్చు.

 

మీరు ఎలాంటి మూవీస్ అండ్ షోస్ చూస్తున్నారు?

ఆపిల్ టీవీలో షోస్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రస్తుతం హోమ్ బిఫోర్ డార్క్ చూస్తున్నాను. ఇది చాలా బాగుంది. అలాగే నెట్‌ ఫ్లిక్స్‌లో ఓజార్క్ మరియు బెటర్ కాల్ సాల్ కూడా బాగుంది.

 

మీ రాబోయే చిత్రాల గురించి చెప్పండి?

అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో చేస్తున్నాను, అలాగే నితిన్ ‘రంగ్ దే’, అల్లు అర్జున్ ‘పుష్ప’ మరియు అన్నిటికంటే పెద్దది ‘ఆచార్య’లో మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి యాక్ట్ చేస్తున్నాను. ‘ఆచార్య’లో నా రోల్ పై సూపర్ ఎగ్జైట్ తో ఉన్నాను.

 

మీరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని చాలామందికి తెలియదు ?

అవును, నేను యుఎస్ లో చదువుకున్నాను, అక్కడే అనుకోకుండా వెన్నెల సినిమాలో యాక్ట్ చేశాను. ఆ చిత్రం తరువాత కూడా నేను ముంబైలోని జెపి మోర్గాన్ వద్ద జాబ్ చేశాను. కానీ ఆఫర్లు పెరిగే సరికి పూర్తిగా యాక్టింగ్ వైపు వచ్చేసాను.

 

మీరు మళ్లీ దర్శకత్వం ఎప్పుడు చేయబోతున్నారు ?

సమీప భవిష్యత్తులో.. నేను మళ్ళీ దర్శకత్వం చేసిన సినిమాని మీరు చూసాక కూడా మీరు సురక్షితంగా ఉండగలరు అని హామీ ఇస్తున్నాను. అయితే జీవితంలోని డైరెక్షన్ గురించి నేను ఇప్పుడు చాలా స్పష్టంగా ఉన్నాను.

సంబంధిత సమాచారం :

X
More