ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ: కల్పిక గణేశ్-నేను టాలీవుడ్‌కు రాధికా ఆప్తే అవ్వాలనుకుంటున్నాను

ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ: కల్పిక గణేశ్-నేను టాలీవుడ్‌కు రాధికా ఆప్తే అవ్వాలనుకుంటున్నాను

Published on May 19, 2020 11:17 PM IST

లాక్‌డౌన్ ఇంటర్వ్యూను కొనసాగిస్తూ నేడు టాలెంటెడ్ హీరోయిన్ కల్పిక గణేశ్‌ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆమెతో జరిగిన వివరణాత్మక సంభాషణలో ఆమె నటించిన వెబ్ సిరిస్ లూసర్ గురుంచి, ప్యూచర్ ప్రాజెక్టుల గురుంచి, ఒక యాక్టర్‌గా ఆమె ఎదురుకున్న ఇబ్బందులు మరియు ఆమె డ్రీమ్ రోల్స్ వంటి మరెన్నో విషయాలను చర్చించడం జరిగింది.

లూసర్‌లో మీ పాత్రకు రెస్పాన్స్ ఎలా ఉంది?

లూసర్‌లో నా పాత్రకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు అది అంత పెద్ద సంచలనం సృష్టించినందుకు అన్నపూర్ణ బ్యానర్‌కు కృతజ్ఞతలు చెప్పింది. ఈ పాత్రలో నా నటన, పనితీరు కారణంగా నా కెరీర్‌లో మొట్టమొదటిసారిగా వివిధ దర్శకులు మరియు మీడియా వ్యక్తుల నుండి నాకు ప్రశంసలు, కాల్స్ వస్తున్నాయని నా పాత్ర గురించి ఇన్ని విషయాలు వినడం నిజంగా మంచి అనుభవమని అన్నారు.

మీరు లూసర్‌లో గ్లామరస్ ముస్లిం అమ్మాయి పాత్రను పోషిస్తున్నారు కదా దాని గురించి చెప్పండి?

ఆ పాత్ర నిజమైన ప్రతిభను చూపిస్తుందని, కాబట్టి నేను ఎప్పుడూ అలాంటి పాత్రలనే చేయాలనుకుంటానని అన్నారు. అయితే ఆ మూడ్‌లో ఉండడం చాలా కష్టమని, కానీ చాలావరకు అది నా లుక్ ద్వారా వచ్చిందని తెలిపింది. అయితే ఒకరోజు ప్రియదర్శి సెట్‌కి వచ్చి నన్ను గుర్తించడం విఫలమైన రోజు నాకు చాలా స్పష్టంగా గుర్తుందని, ఆ పాత్ర యొక్క మొత్తం సారాంశం నాకు సరైనదని నేను భావించిన సమయం అది అని తెలిపింది.

లూసర్‌లోని రుధి షాబన్ పాత్రలో నటించడం చాలా కష్టతరమైన అంశమా?

ఈ వెబ్ సిరీస్‌లో సుదీర్ఘ మోనోలాగ్ ఉంది, అది ట్రైలర్‌లో కూడా చూపబడింది. అది చాలా కఠినమైనది మరియు దానికి భిన్నంగా, చాలా పెద్ద సమస్యలతో ఇంత పెద్ద పాత్రను చేపట్టడం చాలా కష్టమని నేను భావిస్తున్నాను. ఒకసారి నేను సరే అని చెప్పాను, నా దర్శకుడు అభిలాష్ కూడా మంచి నటన ఇవ్వడానికి నాకు చాలా సహాయం చేసాడు. ఈ పాత్ర కోసం నేను కాస్త ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది.

మీకంటూ ఓ ప్రత్యేకమైన విజయం ఆలస్యంగా వచ్చిందా?

తొలుత ఓ డ్యాన్స్ ఆడిషన్ ద్వారా వచ్చి ప్రయాణం సినిమాతో నా కెరిర్ ప్రారంభించానని అయితే ఉద్యోగం చేస్తూనే చాలా సినిమాలు చేశానని తెలిపింది. ఆరెంజ్ సినిమా చేస్తున్న సమయంలో నటనకే నా పూర్తి సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. మన సమయం సరైనది అయినప్పుడే అన్ని మనకు కలిసొస్తాయన్న విషయాన్ని తాను నమ్ముతానని ప్రస్తుతం నేను సీతా ఆన్ ది రోడ్ చిత్రంతో బిజీగా ఉన్న కారణంగా ఆఅ మరియు కేర్ ఆఫ్ కంచెర్లపాలెం వంటి చిత్రాలను కోల్పోయానని అయినా తనకు ఎలాంటి విచారం లేదని తెలిపింది.

ఇప్పుడు మీరు మీ కెరిర్‌ను ఎలా మేనేజ్ చేస్తున్నారు?

ఏదేని మనకు విషయాలు అనుకూలించనప్పుడు నేను బాధపడలేదని అయితే గత సంవత్సరం నుంచి కాస్త టైం నాకు అనుకూలంగా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు నేను నా నైపుణ్యాలను పెంచుకున్నానని, ఇప్పుడు నా నిజమైన వృత్తిని ప్రారంభించానని అన్నారు. అయితే ఇంకా విడుదల చేయవలసిన సినిమాలు నావి ఆరు ఉన్నాయని, నేను ఒక పెద్ద పాత్రను చేయాలనుకుంటున్నానని, రాబోయే తమిళ చిత్రంలో మహిళా కథానాయికగా కనిపించబోతున్నట్టు తెలిపారు.

మీ బ్యాక్‌గ్రౌండ్ గురుంచి చెప్తారా?

నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. నా తల్లి మైసూర్ నుండి వచ్చింది మరియు నాన్నకు మహారాష్ట్ర మూలాలు ఉన్నా, వారు కూడా హైదరాబాద్‌లోనే జన్మించారు. నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ప్రయాణం సినిమాలో ఆఫర్ వచ్చి సినిమాల్లోకి వచ్చాను. నా అన్నయ్య ప్రస్తుతం ఆస్ట్రేలియాలో చదువుతున్నాడు. నేను మోడలింగ్ ప్రయత్నించాలని నా తల్లి కోరుకుంది కానీ నేను సినిమాల వైపు వచ్చే సరికి ఈ విషయం తాను ఎప్పుడూ చెప్పలేదు.

మీ ప్యూచర్ ప్లాన్స్ ఏమిటీ?

నేను వీలైనంత వరకు ఎక్స్‌ప్లోర్ మరియు విభిన్నమైన పాత్రలు చేయాలనుకుంటున్నాను. నా ప్రతిభను నిరూపించడానికి నేను నెగటివ్ పాత్రలనే ఎక్కువగా ఎంచుకుంటాను. రాధికా ఆప్తే ప్రతి ప్లాట్‌ఫామ్‌లో తన ఉనికిని కలిగి ఉన్నందున నేను ఆమెను చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. సినిమా, వెబ్ సిరీస్, డాక్యుమెంటరీ లేదా ఏదైనా టీవీ షో అయినా ఆమె దానిని పూర్తిగా నటనా నైపుణ్యంతో రుజువు చేస్తుంది. నేను టాలీవుడ్ యొక్క రాధికా ఆప్టే అవ్వాలనుకుంటున్నాను మరియు సాధ్యమైనంత ఉత్తమమైన ప్రదర్శనలను ఇవ్వాలనుకుంటున్నానని తెలిపింది.

దీంతో కల్పిక గణేశ్‌తో మా ఇంటర్వ్యూ ముగిస్తూ, ఆమె ప్యూచర్ ప్రాజెక్ట్స్‌కు మా తరుపున శుభాకాంక్షలు తెలుపుతున్నాము.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు