ప్రత్యేకం : తంబోలా గేమ్ ఆడండి – బెంజ్ కార్ గెలుచుకోండి.!

ప్రత్యేకం : తంబోలా గేమ్ ఆడండి – బెంజ్ కార్ గెలుచుకోండి.!

Published on Nov 18, 2014 6:45 PM IST

mimu-sitham
ఏంటి తంబోలా గేమ్ ఆడితే – బెంజ్ కార్ ఇచ్చేస్తారా.? ఇది మేము నమ్మాలా.?. ఇదంతా నమ్మశక్యంగా లేదని పెదవి విరవకండి. అలా చేసారో ఓ బ్రాండ్ న్యూ బెంజ్ కారును సొంతం చేసుకునే ఛాన్స్ మిస్ అయిపోనట్టే.. ఇక అసలు విషయంలోకి వెళతా…

వైజాగ్ మరియు ఉత్తరాంధ్ర హుదూద్ బాధితులను ఆదుకోవడం కోసం తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఒక్కటై ‘మేముసైతం – వుయ్ లవ్ వైజాగ్’ అనే వేడుకని నిర్వహించనుంది. నవంబర్ 30వ తీదీన జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహించి దాని ద్వారా డబ్బు కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే నైట్ డిన్నర్ విత్ స్టార్స్, స్టార్స్ క్రికెట్ మ్యాచ్, మెగా బంపర్ డ్రా టికెట్స్ లాంటి కార్యక్రమాల విశేషాలను మీకు తెలియజేశాం. ఇది కాకుండా తాజాగా తంబోలా గేమ్ ని కూడా మేముసైతం ప్రోగ్రాంలో జాయిన్ చేసారు.

ఇక తంబోలా ప్రోగ్రాం గురించి చెప్పాలంటే.. మేముసైతం నిర్వహిస్తున్న టెలీథాన్ ప్రోగ్రాంలో లైవ్ తంబోలా ప్రోగ్రాంని నిర్వహించనున్నారు. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చెయ్యడానికి ముందుగా మీరు 15,000 రూపాయలు పెట్టి తంబోలా టికెట్ ని కొనుక్కోవాలి. అలా కొనుక్కొని ఈ తంబోలా గేమ్ లో పార్టిసిపేట్ చేసి గెలుపొందిన వారికి బెంజ్ కార్ ని బహుమతిగా ఇవ్వనున్నారు. నవంబర్ 30న ఈ తంబోలా ప్రోగ్రాం యూసఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగనుంది. సో ఫ్రెండ్స్ ఆ బెంజ్ కారు దక్కించుకునే లక్కీ విన్నర్ మీరే కావచ్చు. సో వెంటనే ఈ తంబోలా గేమ్ ఆడటానికి టికెట్స్ ని కొనుక్కోండి. తంబోలా గేమ్ టికెట్స్ మీకు Bookmyshow.com లో లభిస్తాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు