ప్రత్యేకం : త్రివిక్రమ్ టాక్ షోలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు

ప్రత్యేకం : త్రివిక్రమ్ టాక్ షోలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు

Published on Nov 16, 2014 4:45 PM IST

pawankalyan-trivikram-mahes
తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కలిసి నిర్వహిస్తున్న ‘మేము సైతం’ ప్రోగ్రాంలో ప్రతి స్టార్ హీరో మరియు హీరోయిన్ ఏదో ఒక స్కిట్ తో స్టేజ్ పైన సందడి చేయనున్నారు. వీరి లిస్టులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నారని ఇది వరకే తెలియజేశాం. వీరిద్దరి స్కిట్స్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడని ఇది వరకే తెలియజేశాం. అప్పటి నుంచి వీరు ఎలాంటి ప్రోగ్రాం చేయనున్నారా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు ఎలాంటి ప్రోగ్రాం చేయనున్నారు అనేది మీకు మేము ప్రత్యేకంగా అందిస్తున్నాం.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల కోసం త్రివిక్రమ్ ఓ స్పెషల్ టాక్ షోని డిజైన్ చేసాడు. ఈ టాక్ షోలో త్రివిక్రమ్ తో పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు ముచ్చటించనున్నారు. ఈ రెండు టాక్ షోలు డిఫరెంట్ గా ఉండడమే కాకుండా సెపరేట్ గా కూడా ఉంటాయి. ఈ టాక్ షో గురించిన మార్ని విశేషాలు మాకు తెలియగానే మీకందిస్తాం.

నవంబర్ 30న జరగనున్న ‘మేము సైతం’ ప్రోగ్రాం కంటిన్యూగా 13 నుంచి 15 గంటల పాటు జరగనుంది. ఈ వేడుక కంటిన్యూగా జెమిని టీవీలో లైవ్ ఇస్తారు. స్టార్స్ అందరూ పలు కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు