లక్కీ ఛాన్స్ : ‘మేముసైతం’ నిర్వహిస్తున్న బంపర్ మెగా డ్రా

లక్కీ ఛాన్స్ : ‘మేముసైతం’ నిర్వహిస్తున్న బంపర్ మెగా డ్రా

Published on Nov 12, 2014 9:15 AM IST

Mega-Draw-Pass
తెలుగు చలన చిత్ర పరిశ్రమ హుదూద్ బాధితుల కోసం చేస్తున్న కార్యక్రమం ‘మేముసైతం – వుయ్ లవ్ వైజాగ్’. నవంబర్ 30న జరగనున్న ఈ వేడుక 10 కోట్ల రూపాయల మొత్తాన్ని వసూలు చేసి ఎపి సిఎం రిలీజ్ ఫండ్ కి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే స్టార్ నైట్ డిన్నర్, స్టార్స్ క్రికెట్ మ్యాచ్ మరియు టెలీ థాన్ ప్రోగ్రామ్స్ కి రంగం సిద్దం చేస్తున్నారు. ఇది పక్కన పెడితే తాజాగా ఓ ప్రేక్షకుల కోసం ‘బంపర్ మెగా డ్రా’ని నిర్వహించారు.

ఇక బంపర్ మెగా డ్రా విశేషాలలోకి వెళితే.. మేముసైతం మెగా డ్రా టికెట్ ధర 500 రూపాయలు. అన్ని టికెట్స్ లో నుంచి 104 లక్కీ విన్నర్స్ ని సెలెక్ట్ చేస్తారు. ఈ లక్కీ విన్నర్స్ కి కారు, బైక్, లాప్ టాప్స్, టీవీలు, టాబ్స్ లాంటి విలువైన బహుమతులను అందజేయనున్నారు. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన వారి వివరాలను 27వ తీదీన జెమిని టీవీ లో అనౌన్స్ చేస్తారు. అలాగే ఈ విన్నర్స్ కి నవంబర్ 30వ తేదీన జరిగే మేము సైతం ప్రోగ్రాంలో స్టార్స్ చేత బహుమతులను అందజేస్తారు.

మీరు ఈ మెగా బంపర్ డ్రా టికెట్స్ ని బుక్ మై షో లో బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ బంపర్ మెగా డ్రా టికెట్స్ తో పాటు స్టార్స్ క్రికెట్ మ్యాచ్ కి సంబదించిన టికెట్స్ ని, స్టార్ తో డిన్నర్ చేసే టికెట్స్ ని కూడా మీకు బుక్ మై షోలోనే బుక్ చేసుకోగలరు. మరో రెండు రోజుల్లో ఈ టికెట్స్ కి సంబదించిన బుకింగ్ ని ఓపెనింగ్ చేయనున్నారు. బుక్ మై షో లో లభించే అన్ని టికెట్స్ ధరల వివరాలు మీ కోసం..

1. డైన్ విత్ స్టార్స్ – 1 లక్ష

2. స్టార్స్ క్రికెట్ మ్యాచ్ – 3000 రూపాయలు

3. మేముసైతం మెగా డ్రా – 500 రూపాయలు

తాజా వార్తలు