“ఆచార్య” పై మరింత పెరుగుతున్న అంచనాలు.!

Published on Apr 1, 2021 3:32 pm IST

లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచి కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరి దీనికి ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ మేకర్స్ ఆ హైప్ ను మరో లెవెల్ కి తీసుకెళ్లారు. మెగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ తో ఈ సినిమా మరో స్థాయికి వెళ్ళింది.

అయితే మెగా ఫ్యాన్స్ కు ఇది మంచి ఊపు ఇచ్చినా రియల్ మూవీ లవర్స్ కి మాత్రం చిరు మరియు మణిశర్మల కాంబో అనే మరో ఆసక్తి ఉంది. దీనితో ఎలా ఉంటుంది వింటేజ్ మ్యాజిక్ చేస్తారా అన్న దానికి మాత్రం నిన్న విడుదలైన లాహే లాహే ఫస్ట్ సింగిల్ తో సమాధానం దొరికింది.

దీనికి ఈ కాంబో పై మంచి అంచనాలు ఉన్నవారు, సంగీత ప్రియులు, మెగా ఫ్యాన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది. మళ్ళీ పాత రోజులని గుర్తు చేసారని ఫుల్ ఆల్బమ్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రంలో మిగతా సాంగ్స్ కూడా హిట్టయితే మళ్ళీ “స్టాలిన్”, “జై చిరంజీవ” రోజులు వెనక్కి వచ్చేసినట్టే. మొత్తానికి మాత్రం ఈ సాంగ్ తో అంచనాలు మరింత అయ్యాయి తప్పితే చెక్కు చెదరలేదు.

సంబంధిత సమాచారం :