అంచనాలను పెంచుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్
Published on Aug 21, 2018 12:08 pm IST


ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ ఈ రోజు ఉదయం 11.30 గంటలకు విడుదల చేసింది చిత్రబృందం. నరసింహారెడ్డి గెటప్ లో మెగాస్టార్ అద్భుతంగా కనిపించారు. చివరి షాట్ లో గుర్రం పై ఆయన కత్తి దూస్తుంటే వెంట్రుకలు నిక్కపొడుచుకున్నేంత ఉద్రేకం కలిగించింది టీజర్. ప్రధానంగా టీజర్ లో వినిపించిన మ్యూజిక్ టీజర్ కే హైలెట్, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్‌ త్రివేదీ కేవలం టీజర్ తోనే అంచనాలను అందుకున్నారు.

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రుపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి లాంటి భారీ తారాగణ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

టీజర్ కోసం క్లిక్ చెయ్యండి

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook